అలాంటి పాత్ర చేయాలని ఉంది.. తెలుగు అమ్మాయి రీతూ వర్మ కోరిక ఎప్పుడు నెరవేరేనో..?

MADDIBOINA AJAY KUMAR
అందాల ముద్దు గుమ్మ రీతు వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకుంటూ వెళుతుంది. ఇకపోతే ఈమె తెలుగు తో పాటు ఇప్పటికే అనేక ఇతర భాష సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. కెరియర్ లో ఇప్పటి వరకు చాలా సినిమాలలో నటించిన ఎక్కువ శాతం గ్రామర్ షో పాత్రల వైపు వెళ్లకుండా క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలోనే ఎక్కువ శాతం కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇకపోతే ఈ బ్యూటీ కి ఓ పాత్రలో నటించాలని చాలా కోరికగా ఉందట. ఆ పాత్ర ఏమిటి అనే వివరాలను ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా రీతూ వర్మ తన డ్రీమ్ రోల్ గురించి చెబుతూ ... నాకు స్పై ఏజెంట్ పాత్రలో నటించాలని ఉంది అని ఈమె చెప్పింది. అలాగే ఎవరైనా "స్పై" ఏజెంట్ పాత్ర కథను నాకు చెప్పినట్లు అయితే దాదాపుగా ఆ సినిమా చేయడానికి నేను ప్రయత్నిస్తాను అని ఈ బ్యూటీ తాజా ఇంటర్వ్యూ లో తెలియజేసింది.

మరి ఎవరైనా ఈ బ్యూటీ కోసం అదిరిపోయే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ తో కూడిన స్పై అజెంట్ పాత్రను డిజైన్ చేస్తారేమో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం రీతూ వర్మ , శ్రీ విష్ణు హీరోగా హాసిత్ గోలి దర్శకత్వంలో రూపొందుతున్న స్వాగ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ బ్యూటీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. మరి ఈ సినిమాతో ఈమెకు ఏ స్థాయి విజయం దక్కుతుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: