అల్లు అర్జున్ మూవీలలో ఛాన్స్ మిస్ చేసుకున్న బ్యూటీలు వీరే.. చేసుంటే పరిస్థితి వేరేలా ఉండేది..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. ఇక ఈయనకు సూపర్ క్రేజ్ ఉండడంతో ఈయన నటించే సినిమాలో అవకాశం వస్తే చాలా మంది ఎంతో సంతోషంగా సినిమాను ఓకే చేస్తూ ఉంటారు. కానీ అల్లు అర్జున్ హీరో గా రూపొందిన కొన్ని సినిమాలను కొంత మంది బ్యూటీ లు రిజెక్ట్ చేశారు. ఆ వారు ఎవరు ఎందుకు రిజెక్ట్ చేశారు అనే వివరాలను తెలుసుకుందాం.
అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప మొదటి భాగంలో సుకుమార్ మొదటగా హీరోయిన్ గా సమంత ను అనుకున్నాడట. అందులో భాగంగా ఆమెకు కలిసి కథను కూడా వివరించాడట. కథ మొత్తం విన్న ఆమె సినిమా బాగుంది చేస్తాను అని చెప్పిందట. కానీ ఆ తర్వాత ఈమెకు ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 లో అవకాశం రావడంతో అందులో నటిస్తాను మీరు వేరే ఎవరినైనా చూసుకోండి అని చెప్పింది. దానితో సుకుమార్ , రష్మిక ను కలిసి ఈ సినిమాలో హీరోయిన్ గా ఒకే చేసుకున్నాడట.

కొన్ని సంవత్సరాల క్రితం క్రితం అల్లు అర్జున్ "వేదం" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో అనుష్క వేశ్య పాత్రలో నటించింది. ఈ మూవీ కి దర్శకత్వం వహించిన క్రిష్ జాగర్లమూడి మొదటగా అనుష్క పాత్ర కోసం నయనతార ను సంప్రదించాడట. కాకపోతే ఈమె ఈ సినిమాలో నటించడానికి అంగీకరించలేదట. అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప మొదటి భాగంలో సమంత ఐటమ్ సాంగ్ లో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ అవకాశం మొదటగా కృతి శెట్టి కి వచ్చిందట. కాకపోతే కెరియర్ బిగినింగ్ లోనే ఐటెం సాంగ్స్ చేస్తే ఆ తర్వాత కూడా అలాంటి అవకాశాలే వస్తాయి అని ఉద్దేశంతో ఈమె ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: