"ఒక్కడు" కి మొదట అనుకున్న రెండు టైటిల్స్ ఏంటో తెలుసా..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు తని కెరీర్ ప్రారంభంలో ఒక్కడు మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఆ సమయంలో టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న భూమిక హీరోయిన్ గా నటించగా ..  చూడాలని ఉంది లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత గుణశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎం ఎస్ రాజు ఈ సినిమాను నిర్మించగా ... మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ 2003 వ సంవత్సరం జనవరి 15 వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది.

ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో మహేష్ బాబు కు అద్భుతమైన గుర్తింపు కూడా లభించింది. ఈ మూవీ కి ఒకడు అనే టైటిల్ కంటే ముందు మరో రెండు టైటిల్ లను కూడా అనుకున్నారట. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ టైటిల్ లను వద్దనుకొని ఒక్కడు కు ఫిక్స్ అయ్యారట. అసలు ఆ టైటిల్స్ ఏవి ..? వాటిని ఎందుకు వద్దు అనుకున్నారు అనే విషయాలను తెలుసుకుందాం.
మహేష్ బాబు "ఒక్కడు" సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఈ మూవీ కి అతడే ఆమె సైన్యం అనే టైటిల్ లో పెట్టాలి అనుకున్నారట. ఇక తీరా చూస్తే ఆ టైటిల్ ని అప్పటికే ఎవరో రిజిస్టర్ చేసుకుని ఉండడంతో ఆ టైటిల్ ను వద్దనుకున్నారట. ఆ తర్వాత కబడ్డీ అనే టైటిల్ ను పెడదామా అని కొంత కాలం ఆలోచించారట. కాకపోతే చివరగా ఒక్కడు అనే టైటిల్ బాగుంటుంది అని ఆలోచనకు మూవీ బృందం రావడంతో ఇదే టైటిల్ ను కన్ఫామ్ చేశారట. అలా మొదటగా ఈ సినిమాకు అతడే ఆమ సైన్యం , కబడ్డీ అనే టైటిల్ లను అనుకున్న చివరకు మాత్రం ఒక్కడు అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: