వామ్మో: కేజిఎఫ్-2 తర్వాత మళ్లీ కల్కి మాత్రమే ఆ రికార్డు సొంతం..!

Divya
పాన్ ఇండియా హీరో ప్రభాస్, దీపికా పదుకొ, దిశాపటాని, అమితాబచ్చన్, కమలహాసన్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన కల్కి 2898AD చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.. ప్రస్తుతం థియేటర్లో విజయవంతంగా ముందుకు వెళుతున్న కల్కి సినిమా సమీపంలో కూడా ఎలాంటి బడా సినిమాలు లేకపోవడంతో కల్కి చిత్రానికి బాగానే కలిసి వచ్చింది. ఇక ఓవర్సీస్ లో కూడా 20 మిలియన్ల దిశగా అడుగులు వేస్తోంది.

విడుదలకు ముందే భారీ స్థాయిలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన కల్కి చిత్రం కొన్ని ఏరియాలలో నిర్మాతలు ఓన్ రిస్క్ చేసి మరి విడుదల చేశారు. దాదాపుగా అన్ని ఏరియాలలో కూడా కలిగే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. ఇకనుండి వచ్చేవన్నీ లాభాలే అన్నట్లుగా సమాచారం అయితే ఈ మధ్యకాలంలో ఎగ్జిక్యూటర్లకు డిస్ట్రిబ్యూటర్లకు సైతం కొంతమేరకు లాభాలు తెచ్చి పెట్టిన చిత్రాలలో కల్కీ మాత్రమే. ముఖ్యంగా ఏపీలోని వెస్ట్ గోదావరి వంటి చిన్న సెంటర్లో కూడా దాదాపుగా ఎనిమిది కోట్లకు పైగా కలెక్షన్స్ సంపాదించి శభాష్ అనిపించుకుంది.

ముఖ్యంగా థియేటర్లలో క్యాంటీన్ ఆదాయం ,పార్కింగ్ ఆదాయం కూడా బాగానే వచ్చినట్లు తెలుస్తోంది.ఇలా ఈ ఏడాదిలో ప్రతి ఒక్కరు లాభాలు చూసిన చిత్రంగా కల్కి సినిమా ఉన్నది. బయ్యర్లకు కల్కి సినిమా కూడా కాస్త భరోసా ఇచ్చినట్లుగా కనిపిస్తోంది మరి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సినిమాల పైన ఫోకస్ చేస్తున్నట్లుగా సమాచారం.. అలాగే మరొకవైపు నిర్మాత అశ్వని దత్త కూడా కల్కి సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది సినిమా కంటెంట్ పైన నమ్మకంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేజిఎఫ్-2 తరువాత ఓన్ రిస్కు చేసి ప్రపంచమంతా అడ్వాన్సులు మీద చేసిన సినిమా కల్కి సినిమా మాత్రమే అంటూ తెలిపారు. ఇదంతా తన అల్లుడు నాగ్ అశ్విన్ తోనే అయ్యింది అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: