సమంతకు ఆ ముగ్గురు హీరోలు చాలా స్పెషల్.. ఎందుకంటే..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లిన ముద్దుగుమ్మలు కొంత మంది హీరోలతో ఎక్కువ సినిమాలలో నటిస్తూ ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి సమంత కూడా ఇప్పటివరకు తన కెరియర్ లో కొంత మంది హీరోలతో ఎక్కువ సినిమాలలో నటించింది. వారు ఎవరు ..? ఈ బ్యూటీ ఆ హీరోలతో ఎన్ని సినిమాలలో నటించింది అనే వివరాలను తెలుసుకుందాం.

అందాల ముద్దు గుమ్మ సమంత "ఏం మాయ చేసావే" అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటించాడు. ఈ మూవీ తో ఈ జంటకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో మనం , మజిలీ అనే మూవీ లు రూపొందాయి. ఇక వీరి కాంబినేషన్లో రూపొందిన ఈ మూడు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.

నాగచైతన్య తర్వాత సమంత సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా మూడు సినిమాలలో నటించింది. మొదట వీరి కాంబినేషన్లో దూకుడు సినిమా వచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ మూవీ తో సమంతకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ రూపొందింది. ఆ తర్వాత బ్రహ్మోత్సవం అనే మరో మూవీ వచ్చింది. ఇందులో దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మంచి విజయాలను అందుకోగా , బ్రహ్మోత్సవం మూవీ ప్రేక్షకులను నిరుత్సాహ పరిచింది.
ఇక సమంత , జూనియర్ ఎన్టీఆర్ తో కూడా మూడు సినిమాలలో నటించింది. వీరి కాంబినేషన్లో మొదటగా బృందావనం సినిమా రాగా, ఆ తర్వాత రామయ్య వస్తావయ్య, రభస మూవీలు వీరి కాంబోలో రూపొందాయి. వీరి కాంబోలో రూపొందిన మూడు సినిమాలలో బృందావనం సినిమా మంచి విజయం సాధించగా, రామయ్య వస్తావయ్య, రభస సినిమాలు బాక్స్ ఆఫీస్ బోల్తా కొట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: