ఇండియన్ 2 : కమల్ పాత్ర మరీ అంత తక్కువా..?

murali krishna
తమిళ సీనియర్ స్టార్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‍లో వస్తున్న ఇండియన్ 2 (భారతీయుడు 2) సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 28 సంవత్సరాల క్రితం 1996లో వీరి కాంబోలో వచ్చిన ఇండియన్ చిత్రం భారీ బ్లాక్‍బస్టర్ అవడంతో పాటు ఐకానిక్ మూవీగా నిలిచింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు దానికి సీక్వెల్‍గా ఇండియన్ 2 వస్తోంది. దీంతో ఈ చిత్రానికి ఫుల్ హైప్ ఉంది. ఈ సినిమా జూలై 12వ తేదీన విడుదల కానుంది. ఈ తరుణంలో ఇండియన్ 2 మూవీ ఆడియోను మూవీ టీమ్ లాంచ్ చేసింది. ఇందుకోసం ఓ భారీ ఈవెంట్ నిర్వహించింది.ఇండియన్ 2 మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‍లో దర్శకుడు శంకర్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ మూవీ కోసం కమల్ హాసన్ చేసిన కృషిని వివరించారు.అయితే ఈ సినిమాలో లీడ్ రోల్‌లో నటిస్తున్న కమల్ హాసన్‌ ఇందులో తక్కువ సమయమే కనిపించబోతున్నాడంటూ పుకార్లు తెరపైకి వస్తున్నాయి.
తాజాగా వీటిపై ప్రమోషనల్ ఈవెంట్‌లో క్లారిటీ ఇచ్చాడు శంకర్‌. కమల్ హాసన్ సార్ స్క్రీన్‌ టైం ఫుల్‌గా ఉంటుంది. ఆయన స్క్రీన్‌పై కనిపించకున్నా సినిమాలోని ఇతర పాత్రలు ఆయన గురించి మాట్లాడతాయి. ఇది ఉలగనాయగన్ సినిమా అంటూ పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేశాడు శంకర్‌. అవినీతి, లంచం బ్యాక్‌డ్రాప్‌ స్టోరీతో సాగే ఈ చిత్రం ఆల్‌టైమ్‌ సూపర్ హిట్‌ బ్లాక్ బస్టర్‌ భారతీయుడుకు సీక్వెల్‌గా వస్తోందని తెలిసిందే.
ఇండియన్‌ 2లో ఎస్‌జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్‌, సముద్రఖని, లెజెండరీ కమెడియన్‌ బ్రహ్మానందం, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్‌, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్‌పై ఉదయనిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ తెరకెక్కిస్తున్నారు.ఇండియన్ 2 సినిమా షూటింగ్ ఐదేళ్ల క్రితమే మొదలైంది. అయితే, వివిధ కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యమవుతూ వస్తోంది. ఓ దశలో ఈ ప్రాజెక్ట్ ఉండదేమోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, మళ్లీ గతేడాదిలోనే ఈ మూవీ షూటింగ్ పట్టాలు ఎక్కింది. ఇండియన్ 3 కూడా తీసుకురావాలని శంకర్ డిసైడ్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: