అనుభవం.. నాలెడ్జ్ అన్నీ ఉన్నా కూడా ఆ మిస్టేక్ చేస్తున్న బన్నీ.. సుకుమార్..?

Pulgam Srinivas
సినిమా కథ , కథనాలు బాగుండడం వేరు.. ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడం వేరు. ఒక సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవాలి, మంచి కలెక్షన్లను రావాలి అంటే ఆ సినిమా అద్భుతంగా ఉండడం కంటే కూడా అది అద్భుతమైన సమయంలో విడుదల కావాలి. కొన్ని సినిమాలు సూపర్ గా ఉన్న రాంగ్ టైమ్ లో విడుదల కావడం వల్ల పెద్ద మొత్తంలో కలెక్షన్లను రాబట్ట లేకపోవచ్చు. మరొక సినిమా గొప్ప స్థాయిలో లేకపోయిన మంచి టైమ్ లో విడుదల కావడం , వేరే ఇతర సినిమాలు పోటీ లేకపోవడంతో కొన్ని సినిమాలకు మంచి కలెక్షన్లు వచ్చిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.

ఇకపోతే కొన్ని సినిమాల విషయంలో విడుదల తేదీ అనేక సార్లు పోస్ట్ పోన్ అయిన కూడా ఆ సినిమాపై దాని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే సినిమాను అనేక సార్లు పోస్ట్ పోన్ చేసినట్లయితే ఆ సినిమాపై అంచనాలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే అనేక నెగిటివ్ వార్తలు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 1 మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమా ద్వారా ఈ మూవీ లో నటించిన నటీనటులకు , టెక్నీషియన్స్ కు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. అలాగే ఈ మూవీ లో హీరోగా నటించిన అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు కూడా దక్కింది.

ఈ మూవీ యొక్క రెండవ భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొంత కాలం క్రితం ప్రకటించారు. కానీ ఈ తేదీన ఈ మూవీ ని విడుదల చేయడం లేదు. మళ్లీ డిసెంబర్ 6 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా యొక్క మొదటి భాగం విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. అలాగే ఈ మూవీ రెండవ భాగం అనేక సార్లు విడుదల వాయిదా పడడంతో ఈ మూవీ పై అంచనాలు కాస్త తగ్గి అవకాశం ఉంది. మరి ఎంతో అనుభవం , నాలెడ్జ్ ఉన్న సుకుమార్ , బున్ని ఈ సినిమా విషయంలో ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తున్నారా అని చాలామంది అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: