నిజమేనా:పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ భేటీ..?

Divya
ఆంధ్రప్రదేశ్లో మెగా కుటుంబం నుంచి ఎన్నికల ముందు చాలామంది మెగా హీరోలు కూడా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి మద్దతుగా తమ వంతు కృషి చేశారు.. పిఠాపురం వెళ్లి ప్రచారం కూడా చేశారు.అయితే అల్లు అర్జున్ మాత్రం తన స్నేహితుడు అయిన వైసీపీ నేతకు సపోర్టివ్ గా చేయడం జరిగింది.. అయితే అతనికి సపోర్ట్ చేసిన తన మద్దతు మాత్రం పవన్ కళ్యాణ్ కి ఉంటుందని తెలియజేశారు.. కానీ చాలామంది మెగా అభిమానులు , టిడిపి కార్యకర్తలు నేతలు సైతం అల్లు అర్జున్ ని తప్పు పట్టడం జరిగింది.. మరి కొంతమంది ఏకంగా యూట్యూబ్ ఛానల్స్ లో కూడా నానా రచ్చ చేశారు.

మెగా హీరో నాగబాబు మాత్రం ఏకంగా అల్లు అర్జున్ ఉద్దేశించి ఒక సంచలన ట్విట్ కూడా చేయడం జరిగింది.. అయితే ఇదంతా సర్దుమునుగుతున్న  సమయంలో ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ తో హీరో అల్లు అర్జున్ భేటీ కాబోతున్నారని ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది.. మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు అర్జున్ ని దూరం పెట్టడంతో ఈ రూమర్స్ సైతం చెక్ పెట్టే విధంగా చిరంజీవి అల్లు అర్జున్తో పవన్ కళ్యాణ్ తో ఒక భేటీ ఏర్పరిచేలా ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడైతే ఈ విషయం వైరల్ గా మారుతున్నది. ఒకవేళ బన్నీ పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారని వార్తలు నిజమైతే ఈ విషయాలను అటు జన సైనికులు ఖండిస్తారా లేదా అనే విషయం చూడాల్సి ఉన్నది. ఇప్పటికే మెగా హీరో సాయి తేజ్.. అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని కూడా అన్ ఫాలో చేశారు.. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా మెగా వర్సెస్ అల్లు ఫాన్స్ మధ్య గొడవ రోజురోజుకి ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంది. మరి ఇలాంటి సమయంలో ఇలాంటి పనిచేయడం జరుగుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: