సాయి పల్లవి దగ్గర నుండి ఆ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు.. ఆ పాత్రలో నటించాలని ఉందన్న బ్యూటీ..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగులో ఈటీవీ చానల్లో ప్రసారం అయినటువంటి డీ డాన్స్ ప్రోగ్రాం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది సాయి పల్లవి. ఇక డాన్సర్ గా తనకంటూ ఒక ప్రత్యేక ఈ ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత సినిమాలపై ఇంట్రెస్ట్ చూపడం మొదలు పెట్టింది. అందులో భాగంగా మలయాళ సినిమా అయినటువంటి ప్రేమమ్ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకోవడం , ఇందులో ఈమె తన నటనతో , హవా భావాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈమెకు ఆ తర్వాత నుండి ఇతర భాష సినిమాలలో కూడా అవకాశాలు పెరిగాయి.

ఇక ఈమె వరుణ్ తేజ్ హీరో గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఫిదా మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడం , ఇందులో ఈమె తన డాన్స్ , నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈమె చాలా ఇండస్ట్రీ సినిమాలలో నటిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. ఈ బ్యూటీ కి ఓ జోనర్ సినిమాలో నటించాలని ఉందట  అందుకు సంబంధించిన వివరాలను తాజాగా ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.

తాజాగా సాయి పల్లవి మాట్లాడుతూ ... నాకు ఒక ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో నటించాలని ఉంది అని , అలాగే తన పాత్రతో అద్భుతమైన కామెడీ పండించాలని ఉందని చెప్పింది. ఎవరైనా అదిరిపోయే కామెడీ మూవీ లో నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నటిస్తాను అని ఆమె చెప్పుకొచ్చింది. ఇలా ఈమె డాన్సర్ కావడంతో డాన్స్ ఎక్కువ ఉండే సినిమాలను ఇష్టపడుతుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ ఈమెకు కామెడీ పాత్రలు అంటే చాలా ఇష్టం అంటా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: