'రొమాన్స్ చేస్తుంటే మూడ్ చెడగొట్టేది'.. రోజాపై అసహనం?

Purushottham Vinay

సీనియర్ హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి ఫ్యామిలీ & రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. శ్రీకాంత్ కెరీర్‌కు డీ రామానాయుడు నిర్మించిన తాజ్ మహల్ సినిమా బ్రేక్ ఇచ్చింది. యువతకు ఈ సినిమా బాగా కనెక్ట్ కావడంతో అప్పట్లో బాగా ఆడింది. ఆ వెంటనే దర్శకేంద్రుడు కే .రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్లి సందడి సినిమాతో శ్రీకాంత్‌ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు. ముఖ్యంగా అమ్మాయిల కలల రాకుమారుడిగా, ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇష్టమైన హీరోగా శ్రీకాంత్ మారిపోయారు. అప్పట్లో అమ్మాయిలు తమకు కాబోయే భర్త అంటే అచ్చం శ్రీకాంత్‌లా ఉండాలని అనుకున్నారంటే అతిశయోక్తి కాదు.పెళ్లి సందడి సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత శ్రీకాంత్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ వెంటనే కూతురు, వినోదం, ఎగిరే పావురమా, ఆహ్వానం, తారక రాముడు, మా నాన్నకు పెళ్లి, ప్రేయసి రావే, చాలా బాగుంది, నిన్నే ప్రేమిస్తా, అమ్మో ఒకటో తారీఖు, ఆడుతూ పాడుతూ, ఖడ్గం, పెళ్లాం ఊరెళితే, ఆపరేషన్ దుర్యోధన, శ్రీరామ రాజ్యం వంటి పలు చిత్రాలతో బిజీ స్టార్‌గా నిలిచారు. 


అయితే శ్రీకాంత్ పని అయిపోయింది అనుకున్న దశలో శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ ఇంకా సరైనోడు సినిమాలతో బౌన్స్ బ్యాక్ అయ్యారు.ఇటీవల వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్న హీరో శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాజీ మంత్రి మాజీ నటి రోజా గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆమె వల్ల తాను చాలా ఇబ్బంది పడినట్లు చెప్పారు. క్షేమంగా వెళ్లి లాభంగా రండి, తిరుమల తిరుపతి వెంకటేశ లాంటి సినిమాల్లో వీరు ఇద్దరూ కలిసి నటించారు. అయితే రోజా తనను అన్నయ్య అని ఎంతో ప్రేమగా గౌరవంగా పిలిచేదని.. కానీ ఓ రోజు షూటింగ్‌ జరిగేటప్పుడు రొమాంటిక్ సాంగ్ ఉందని ఆ సమయంలో అన్నా అలా చేద్దాం , ఇలా చేద్దాం అంటే తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని శ్రీకాంత్ తెలిపారు. వెంటనే ఎహే ఆపు .. నువ్వు అన్నా అని పిలిస్తే నాకు ఆ ఫీల్ రావడం లేదని సరదాగా కోప్పడేవాడినని శ్రీకాంత్ చెప్పారు. అలా నవ్వుకుంటూ ఇద్దరం కలిసి షూటింగ్ చేసుకుంటూ వెళ్లిపోయేవాళ్లమని శ్రీకాంత్ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: