రాజమౌళి సినిమా కోసం మహేష్ కే గురువైన ఆ నటుడు?

Purushottham Vinay

సూపర్ స్టార్ మహేష్ బాబు – రాజమౌళి సినిమా కోసం అందరూ ఎంతో ఎదురుచూస్తున్నారు. ఈ పాన్ వరల్డ్ సినిమాని ఎప్పుడో అనౌన్స్ చేసినా ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమం కూడా చేయలేదు.ఈ విషయంలో మహేష్ బాబు అభిమానులు నిరాశ చెందుతున్నారు. రాజమౌళితో సినిమా అంటే కనీసం మూడేళ్లు అయినా టైం పడుతుంది. తమ హీరో నుంచి సినిమా రాదు. అలాంటిది అప్డేట్స్ కూడా ఏమి ఇవ్వకపోతే ఎలా అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.అయితే SSMB29 సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది ఫాస్ట్ గానే జరుగుతుందని సమాచారం. ఆల్రెడీ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ అయిపోయిందని, మ్యూజిక్ వర్క్ కూడా జరుగుతుందని పలువురు తెలిపారు. ఇక మహేష్ బాబు కూడా ఈ సినిమాకి కావాల్సిన రగ్ లుక్ లోకి మారుతున్నాడు. మరోవైపు ఈ మూవీకి కావాల్సిన శిక్షణలు కూడా తీసుకుంటున్నాడు.

అయితే మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా రోజూ మహేష్ బాబు – రాజమౌళి సినిమా గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది.తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త నెట్టింటా తెగ వైరల్ అవుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సీనియర్ నటుడు నాజర్ దగ్గర భాషకి సంబంధించిన యాసలో, అలాగే హావభావాల్లో ట్యూషన్ తీసుకుంటున్నాడని సమాచారం తెలుస్తుంది. గతంలో బాహుబలి సమయంలో కూడా ప్రభాస్ నాజర్ దగ్గర ఈ విషయంలో ట్యూషన్ తీసుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు మహేష్ బాబు కూడా నాజర్ దగ్గర యాస, హావభావాల్లో మెళకువలు నేర్చుకుంటున్నాడని సమాచారం తెలుస్తుంది. రాజమౌళి తన సినిమాల్లో ఖచ్చితంగా పర్ఫెక్షనిజం ఉండేలా చూసుకుంటాడు. ఇందుకోసమే మహేష్ పెద్ద స్టార్ హీరో అయినా ఎలాంటి ఈగో లేకుండా సీనియర్ నటుడు నాజర్ దగ్గర మెళకువలు నేర్చుకుంటున్నారని సమాచారం తెలుస్తుంది. గతంలో నాజర్ – మహేష్ బాబుతో కలిసి చాలా సినిమాల్లో పని చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: