స్టార్ హీరోయిన్ అవ్వాలంటే.. టూ పీస్ బికినీ వేసుకోమన్నాడు : హీరోయిన్

praveen
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్,  బాడీ షేమింగ్ ఉందా ఇదే విషయంపై ఎప్పుడు చర్చ జరుగుతూ ఉంది  అయితే ఒకప్పుడు ఇలాంటి విషయాలపై ఎవరూ నోరు విప్పే వారు కాదు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం సోషల్ మీడియా కారణంగా ఇక ఎంతోమంది స్టార్స్ సైతం ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి తమ అభిప్రాయాలను చెప్పేస్తూ ఉన్నారు. ఎంతో మంది నటీమణులు తమకు కెరియర్ తొలినాళ్లలో ఎవరైనా చేదు అనుభవాల గురించి నిర్భయంగా ఎన్నో నిజాలను బయటపెట్టేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.

 సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో అవకాశాలు రావాలంటే   ఇక పక్కలోకి వెళ్లాల్సిందే అని అంటూ ఉంటారు. ఇంకొన్నిసార్లు అవకాశాలు రావాలంటే చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని అందాల ఆరబోత చేయాల్సిందే అని చెబుతూ ఉంటారు. అయితే చాలామంది హీరోయిన్లు ఇలా అందాల ఆడబోత చేయలేక ఎన్నో ఛాన్సులు మిస్ చేసుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. ఇలాంటివి ఆయా హీరోయిన్లు చెప్పినప్పుడు అందరికీ నిజాలు తెలుస్తూ ఉంటాయి. ఇక ఈటీవలే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మనీషా కోయిరాల కూడా ఇలాంటి ఒక షాకింగ్ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.

 తన కెరియర్ ఆరంభంలో ఒక ఫోటోగ్రాఫర్ తనతో అనుచితంగా ప్రవర్తించాడు అంటూ స్టార్ హీరోయిన్ మనీషా కోయిరాల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఓ ఫోటోషూట్ కు వెళ్లాను అక్కడ ప్రముఖ ఫోటోగ్రాఫర్ నా దగ్గరికి వచ్చి టూ పీస్ బికినీ తెచ్చుకొని వేసుకోమన్నాడు  అవి ధరిస్తేనే స్టార్ అవుతావు అంటూ చెప్పాడు. అయితే ఇవి కేవలం ఈత కొట్టేటప్పుడు తప్ప సినిమాలో అస్సలు వేసుకొని అని అతని మొఖం మీద చెప్పేశాను. అయితే తాను స్టార్ గా ఎదిగిన తర్వాత అతనే మళ్లీ నా ఫోటోలు తీశాడు అంటూ చెప్పుకొచ్చింది మనీషా కొయిరాలా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: