ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీస్ ఇవే..!

Pulgam Srinivas
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 ఇండియన్ మూవీస్ ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.
దంగల్ : బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు నితీష్ తివారి దర్శకత్వం వహించాడు. 2016 వ సంవత్సరంలో విడుదల అయిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఏకంగా వరల్డ్ వైడ్ గా 1924.7 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలలో మొదటి స్థానంలో నిలిచింది.
బాహుబలి 2 : ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమా 2017 వ సంవత్సరం విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1749 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వాసులు చేసి ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో రెండవ స్థానంలో నిలిచింది.
ఆర్ ఆర్ ఆర్ : ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1224.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసిన ఇండియన్ సినిమాలలో మూడవ స్థానంలో నిలిచింది.
కే జి ఎఫ్ చాప్టర్ 2 : యాష్ హీరో గా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2022 వ సంవత్సరం విడుదల ప్రపంచవ్యాప్తంగా 1207.9 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ కలెక్షన్లను వసూలు చేసిన ఇండియన్ సినిమాలలో నాలుగవ స్థానంలో నిలిచింది.
జవాన్ : షారుక్ ఖాన్ హీరోగా నయనతార , దీపికా పదుకొనే హీరోయిన్ లుగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1167.3 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసి అత్యధిక కలెక్షన్లను వరల్డ్ వైడ్ గా రాబట్టిన ఇండియన్ సినిమాలలో ఐదవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: