ఆ క్లాస్ దర్శకుడికి అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్.. వర్కౌట్ అయ్యానా..?

Pulgam Srinivas
జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ఏకంగా 1200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టింది. అలాగే ఈ మూవీ కి ఆస్కార్ అవార్డు లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు కూడా వచ్చింది. దానితో ఈ సినిమాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ మూవీ లో హీరోగా నటించిన ఎన్టీఆర్ కి కూడా అదే స్థాయిలో క్రేజ్ వచ్చింది. దానితో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ హిందీ సినిమా అయినటువంటి వార్ 2 కూడా హీరో గా నటిస్తున్నాడు. ఈ రెండు మూవీలతో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుండి ప్రారంభం కాబోతున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఓ క్లాస్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అసలు విషయంలోకి వెళితే ... కొన్ని రోజుల క్రితమే నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా హాయ్ నాన్న అనే మూవీ రూపొంది మంచి విజయం అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సౌర్యవ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ద్వారా ఈ దర్శకుడికి మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే తాజాగా ఈ దర్శకుడు జూనియర్ ఎన్టీఆర్ ను కలసి ఒక కథను వినిపించినట్లు , ఆ కథ బాగా నచ్చడంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ దర్శకుడి దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఆసక్తిని చూపుతున్నట్లు ఓ వార్తా ప్రసాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: