సమాజాన్ని నాశనం చేస్తున్న ఆ అంశమే ఇండియన్ 2 మెయిన్ స్టోరీ?

Purushottham Vinay

సీనియర్ హీరో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్‌, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'భారతీయుడు 2'.జులై 7 వ తేదీన భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ మూవీ గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి ఇంకా అలాగే సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. మూవీ యూనిట్ ప్రమోషనల్ ప్లానింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ఇండియన్ 2 ఇంట్రో గ్లింప్స్‌ ఇంకా ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి.

భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 7న హైదరాబాద్‌లో ఎంతో వైభవంగా జరిగింది. జులై 7న సాయంత్రం ఆరు గంటల నుంచి ఎన్ కన్వెన్షన్‌లో ఈ భారతీయుడు 2 ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. 28 ఏళ్ల ముందు భారతీయుడు మూవీతో బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసిన కమల్ హాసన్‌, శంకర్ కాంబోలో వస్తోన్న భారీ బడ్జెట్ మూవీ 'భారతీయుడు 2'. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానుల అందరిలోనూ ఆసక్తి పెరిగిపోతుంది. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి నటీనటులు, సాంకేతిక నిపుణులు హైదరాబాద్ లో భారీ వేదిక ఏర్పాటు చేసి అందర్నీ పలకరించారు. ఈ సినిమా తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం చెన్నైలో జరగనుంది. ఈ సినిమా కథ సమాజంలో జరిగే తప్పుల గురించి తెరకెక్కుతుందనే సంగతి తేలిసిందే. కానీ వాటితో పాటు మెయిన్ గా మద్యం మాఫియాతో వేల కోట్లు దోపిడీ జరిగే అంశంపై ఉంటుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: