ఎస్ఎస్ఎంబి 29 : మహేష్ కు యాక్టింగ్ క్లాసులు తీసుకుంటున్న ఆ సీనియర్ యాక్టర్..?

murali krishna
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో అద్భుత విజయం అందుకున్నాడు..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది..ప్రస్తుతం మహేష్ తన తరువాత సినిమా పై ఫోకస్ చేసారు.. మహేష్ తన తరువాత సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం మహేష్ తన లుక్ ను పూర్తిగా మార్చే పనిలో వున్నారు. ఇటీవల లాంగ్ హెయిర్ గుబురు గడ్డంతో కనిపించి మహేష్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు..”ఎస్ఎస్ఎంబి 29 “వర్కింగ్ టైటిల్ తో  ఈ సినిమా తెరకెక్కుతుంది.రాజమౌళి, మహేష్ సినిమాను దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై బ్యానర్ కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో మహేష్ లుక్ విషయంలో ఎలాంటి లీక్స్ ఉండకూడదని రాజమౌళి నుంచి ఆదేశాలు ఉండటంతో ప్రస్తుతం మహేష్ తన లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం మహేష్ ఈ సినిమాకు సంబంధించి కొన్ని వర్క్ షాప్స్ లో పాల్గొంటున్నారట. ఈ వర్క్ షాప్స్ లో మహేష్ బాబుకి సీనియర్ యాక్టర్ నాజర్ స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నట్లు సమాచారం. రాజమౌళి మహేష్ తో బిగ్గెస్ట్ అడ్వెన్చరస్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథ ఇప్పటికే పూర్తి అయినట్లు ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ తెలిపారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ భారీ అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే ముందు ఓ స్పెషల్ ప్రెస్ మీట్ ను మేకర్స్ నిర్వహించనున్నారు. ఈ ప్రెస్ మీట్ లో ఈ సినిమా స్టోరీకి సంబంధించి కీలక విషయాలు రాజమౌళి తెలియజేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: