"కల్కి" వర్సెస్ "భారతీయుడు 2" ఇద్దరికీ ఫుల్ టెన్షన్..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా జూన్ 27 వ తేదీన విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేసిన కొంత కాలానికి కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారతీయుడు 2 మూవీని జూలై 12వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో కల్కి సినిమా విడుదలకు భారతీయుడు 2 విడుదలకు మధ్య 15 రోజుల వరకు గ్యాప్ ఉండడంతో ఈ రెండు సినిమాల మధ్య ఎలాంటి క్లాష్ ఉండే అవకాశం లేదు అని చాలా మంది అంచనా వేశారు.

కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఎందుకు అంటే జూన్ 27 వ తేదీన విడుదల అయిన కల్కి మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన భారీ బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇటు చూస్తే భారతీయుడు 2 సినిమా విడుదలకు రెడీ అయింది. ఈ మూవీ లో కమల్ హాసన్ హీరోగా నటించడం , శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించడం , ఈ మూవీ భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న భారతీయుడు మూవీ కి కొనసాగింపుగా రూపొందడంతో ఈ మూవీ పై కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమాకు గనక మంచి పాజిటివ్ టాక్ వచ్చినట్లు అయితే కల్కి సినిమా కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా భారీగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అదే భారతీయుడు 2 కి గనుక కాస్త నెగటివ్ టాక్ వచ్చినట్లు అయితే జనాలు అంతా కల్కి వైపే చూస్తారు కాబట్టి భారతీయుడు 2 కి వచ్చే కలెక్షన్లు కూడా రావు దీనివల్ల ఈ సినిమా ఎఫెక్ట్ అవుతుంది. దానితో ప్రస్తుతం ఈ రెండు మూవీ బృందాలు టెన్షన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: