డబ్బులు తీసుకోకుండానే ఆ సినిమాలో నటించిన ప్రియమణి.. అందుకే ఆ హీరోకి ఆమంటే అంత అభిమానం..?

MADDIBOINA AJAY KUMAR
కొంత మంది నటీనటులు కొన్ని సినిమాలలో డబ్బులు తీసుకోకుండా హీరో మీదనో , నిర్మాత మీదనో , దర్శకుడి మీదనో  లేదా ఆ సినిమా మీదనో అభిమానంతో మూవీ చేస్తూ ఉంటారు. అలా డబ్బులు తీసుకోకుండా టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ కలిగిన నటీమణిగా చాలా రోజుల క్రితం కొనసాగించిన ప్రియమణి కూడా ఓ సినిమా చేసిందట. అసలు ప్రియమణి అభిమానంతో చేసిన సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం.

తెలుగులో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్ లలో ప్రియమణి ఒకరు. ఈమె పెళ్లయిన కొత్తలో అనే సినిమాతో మంచి గుర్తింపును , మంచి విజయాన్ని తెలుగు లో దక్కించుకుంది. ఆ తర్వాత ఈమెకు యమదొంగ సినిమాలో అవకాశం రావడం , ఇది కూడా మంచి విజయం సాధించడంతో ఈమె తెలుగులో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. ఇలా చాలా రోజుల పాటు కెరియర్ ను కొనసాగించిన ఈమె అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీ లో ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది.

ఈ స్పెషల్ సాంగ్ అద్భుతమైన విజయం సాధించింది. దీని ద్వారా ప్రియమణి కి కూడా సూపర్ క్రేజ్ వచ్చింది. ఈ సాంగ్ ను ఈమె డబ్బులు తీసుకోకుండా కేవలం షారుఖ్ ఖాన్ అంటే అభిమానంతోనే చేసిందట. షారుక్ ఖాన్ అంటే తనకు ఎంతో ఇష్టం కావడం , అలాంటి స్టార్ సినిమాలో అవకాశం రావడంతో ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఈమె ఈ సినిమాలో సాంగ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక దానితో షారుక్ ఖాన్ కూడా ఈమె అంటే ఎంతో రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు. షారుఖ్ ఖాన్ హీరో గా రూపొందిన జవాన్ సినిమాలో కూడా ప్రియమణి కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా ద్వారా కూడా ఈమెకు హిందీ లో అద్భుతమైన గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: