కల్కి దెబ్బకు RRR, KGF2 షెడ్డుకి వెళ్లిపోయాయిగా?

Purushottham Vinay

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి మూవీ జూన్ 27 వ తేదీన విడుదలై ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా అదిరిపోయే రీతిలోనే లభిస్తోన్నాయి. ఇక 9 రోజుల్లో కల్కి 2898 ఏడీ సినిమాకు ఇండియాలో ఏకంగా రూ. 431.55 కోట్ల షేర్ వసూళ్లు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.. ఇక కల్కి సినిమాకు వరల్డ్ వైడ్‌గా 9 రోజుల్లో రూ. 800 కోట్ల గ్రాస్ వచ్చినట్లుగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ పోస్టర్ చూడటానికి అదిరిపోయింది. ఆ పోస్టర్ లో చుట్టూ ఉన్న ఫైర్‌లో ప్రభాస్ కనిపించిన తీరు అయితే ఇప్పుడు ఆకట్టుకుంది. అందువల్ల ఈ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 


ఇకపోతే కల్కి 2898 ఏడీ సినిమా ఆ మొదటి రోజు రూ. 95.3 కోట్ల షేర్ వసూలు చేసింది.  రెండో రోజైన శుక్రవారం రూ. 59.3 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా శనివారం బిజినెస్ ఊపందుకోగా రూ. 66.2 కోట్ల షేర్ రాబట్టింది.  ఆదివారం నాడు బిజినెస్ మరింత పుంజుకుని మొత్తం రూ. 88.2 కోట్లు రాబట్టింది.తరువాత సోమవారం రూ. 34.15 కోట్లు, మంగళవారం నాడు రూ. 27.05 కోట్లు, బుధవారం రూ. 22.7 కోట్లు రాబట్టింది. గురువారం నాడు కల్కి 2898 ఏడీ రూ. 21.8 కోట్లు, శుక్రవారం నాడు రూ. 16.9 కోట్లు వసూలు చేసి మొత్తం రూ. 431.75 కోట్ల షేర్ రాబట్టింది. 8 రోజుల్లో 800 కోట్ల గ్రాస్ రాబట్టిన చిత్రంగా ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ 2 వసూళ్ళని దాటి బాహుబలి 2 తరువాత స్థానంలో నిలిచింది. ఆర్ ఆర్ ఆర్ కి 8 రోజుల్లో 709 కోట్లు రాగా కేజీఎఫ్ 2 కి 8 రోజుల్లో 785 కోట్లు వచ్చాయి. కల్కి ఇలానే ఒక వారం కంటిన్యూ అయ్యిందంటే ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ 2 లైఫ్ టైం వసూళ్ళని ఈజీగా దాటేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: