బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న కల్కి.. ఇప్పటికే ఎన్ని కోట్ల లాభం వచ్చిందో తెలుసా..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD అనే పాన్ ఇండియా చిత్రంలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని దిశ పటని  ప్రభాస్ కి జోడిగా నటించగా ... వైజయంతి మూవీస్ స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్వినీ దత్ కూతురు స్వప్న దత్ ఈ సినిమాను ఎంతో భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ సినిమాలో లోక నాయకుడు కమల్ హాసన్ ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటించగా ... బ్రహ్మానందం , రాజేంద్ర ప్రసాద్ , శోభన , మృణాల్ ఠాకూర్ ముఖ్య పాత్రలలో నటించారు.

అమితా బచ్చన్ , దీపికా పదుకొనే ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించగా ... విజయ్ దేవరకొండ , ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ , దుల్కర్ సల్మాన్ , అనుదీప్ కే వి ఈ మూవీ లో చిన్న చిన్న పాత్రలలో మెరిశారు. ఇకపోతే ఈ సినిమా జూన్ 27 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ విడుదలకు ముందే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు పెద్ద ఎత్తున ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఈ మూవీ కి దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా 370 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ తొమ్మిది రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంది. 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ 374.49 కోట్ల షేర్ ... 719 కోట్ల గ్రాస్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసి 2.49 కోట్ల లాభాలను అందుకొని హిట్ స్టేటస్ ను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: