రొమాన్స్ కు వయసుతో సంబంధం లేదంటున్న మాస్ మహారాజ్..!!

murali krishna
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకడు. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసే ఈ హీరో.. ఆ మధ్య 'ఈగల్' మూవీతో వచ్చాడు. కానీ, ఇది ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు.అయితే తాజాగా రవితేజ గురించి ఓ న్యూస్ హాట్ టాప్పిగ్గా మారింది. అదేమిటంటే సీనియర్ హీరోలంతా స్క్రీన్ మీద రొమాంటిక్ సీన్స్ చేయటం మానేశారు. కోలీవుడ్ స్టార్స్ అయితే ఏకంగా తాత పాత్రల్లో నటిస్తున్నారు. కానీ ఈ సిచ్యుయేషన్‌లోనూ ఓ సీనియర్ స్టార్ రొమాంటిక్ సాంగ్స్‌తో రచ్చ చేస్తున్నారు.సినిమాల సక్సెస్‌ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా ప్రతీ లో కాస్త బోల్డ్ సాంగ్‌ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.త్వరలో మిస్టర్ బచ్చన్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు సీనియర్ స్టార్ రవితేజ. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్‌ యాక్షన్ డ్రామాలో రొమాంటిక్ సీన్స్‌కు కూడా స్కోప్ ఇచ్చారు మేకర్స్‌.లేటెస్ట్ టీజర్‌లో అదే విషయాన్ని రివీల్ చేశారు. ఈ వయసులో రవితేజ ఇలాంటి సీన్స్‌ చేయటం గురించి ఇండస్ట్రీ సర్కిల్స్‌లో గట్టిగానే చర్చ జరుగుతోంది. మాస్ మహరాజ్ ప్రీవియస్ మూవీస్‌లోనూ ఇలాంటి సాంగ్స్ ఉన్నాయి.మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు లో కూడా రొమాంటిక్ నెంబర్‌ ఉండేలా చూసుకున్నారు రవితేజ. ఈ సాంగ్‌లో కమర్షియల్ కు కావాల్సిన రేంజ్‌లో హీరోయిన్‌ను గ్లామరస్‌గా ప్రెజెంట్ చేశారు. అయితే ఈ సాంగ్‌ కూడా ను కాపాడలేకపోయింది.మిగతా హీరోలు వయసుకు తగ్గ పాత్రల్లో నటిస్తుంటే రవితేజ మాత్రం ఇంకా మాస్‌ ఫార్ములా లకే ఫిక్స్ అవ్వటం, కుర్ర హీరోయిన్లతో డ్యూయోట్ల పాడటం ఏంటన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ విమర్శలకు మాస్ మహరాజ్‌ సక్సెస్‌తో చెక్‌ పెడతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: