వైద్యుల‌తో సమంత ఫైటింగ్... మ‌ద్ధ‌తు పలుకుతున్న తారలు!

Suma Kallamadi
సమంత రూత్ ప్రభు గురించి తెలుగు కుర్ర కారుకి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పని లేదు. మొదటి సినిమా ఏమాయ చేసావే తోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు వాళ్ళ మదిని రంజింప చేసింది. ఆ సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో ఇక సమంత వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ లోనే అగ్ర కథానాయకగా పేరుగాంచింది. ఈ క్రమంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ హీరోలతోనే నటించి మెప్పించింది... ఓ క్రమంలో అయితే నిర్మాతల పాలిట వరమై కూర్చుంది. దాంతో సినిమా ఆఫర్లు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. కట్ చేస్తే ఆమె అక్కినేని వారి కోడలు అయిపోయింది.
అయితే దురదృష్టవశాత్తు... కొన్ని అనివార్య కారణాల వలన అనతి కాలంలోనే ఆమె తన భర్త అయినటువంటి నాగచైతన్యతో విడిపోవలసి వచ్చింది. ఇక ఆ తర్వాత ఆమె చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చింది. మరి ముఖ్యంగా కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంది. ఇదే విషయాలను ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లేదు కదా అభిమానులతో పంచుకునేది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె వైరల్ ఇన్ఫెక్షన్లను గురించి మాట్లాడుతూ... ఎంతో ఖర్చు పెడితే గాని కొన్ని రకాల మెడిసిన్స్ సామాన్యులకు అందవని, అందిన మరికొన్నిసార్లు రోగాలు తగ్గని చెప్పుకొచ్చింది. అందుకే వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చేవారు హైడ్రోజన్ పెరాక్సైడ్ కోసం నెబులైజర్ ను వాడాలని, అది ఎంతో తక్కువ ఖరీదని సూచించింది. ఇదిగో ఇక్కడే మొదలైంది అసలు రచ్చ. డబ్బులకు రుచి మరిగిన డాక్టర్లు ఆమెపై రెచ్చిపోయారు. ఇలా వైద్య సేవల్ని తక్కువ ధరకే పేదలకు అందించిన సమంతాని వారు దుయ్యబట్టారు.
ఈ క్రమంలో ఓ సో కాల్డ్ డాక్టర్ సమంత పైన అనరాని మాటలతో ఎటాక్ చేశాడు. అయితే ఆ వైద్యుడు బెదిరింపులకు సమంత లొంగలేదు. వెంటనే వాడి మాటలను తిప్పి కొట్టింది. ఇక ఈ విషయంలో సమంతకి చాలా మంది తారలు మద్దతు పలికారు. సమంత చేసింది 100% కరెక్ట్ అని, డాక్టరుదే తప్పని ఆరోపించారు. దాంతో సమంత వారికి కృతజ్ఞతలు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: