భయపెట్టడానికి రెడీ అవుతున్న శృతిహాసన్.. కొత్త ప్లాన్ తో సిద్దం..?

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు తెలుగు స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కడం మొదలు అయ్యింది. అందులో భాగంగా ఈమె నటించిన చాలా మూవీ లు మంచి విజయం సాధించడం అలాగే అందులో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

దానితో ఈమె చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లిపోయింది. ఇకపోతే ఇప్పుడు కూడా ఈ ముద్దుగుమ్మకు వరసగా సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. పోయిన సంవత్సరం ఈమె నటించిన నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యి నాలుగు మంచి విజయాలను అందుకున్నాయి. మొదట పోయిన సంవత్సరం ఈ బ్యూటీ వీర సింహా రెడ్డి మూవీ తో ప్రేక్షకులను పలకరించి మొదటి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వాల్టేరు వీరయ్య సినిమాతో మరో విజయాన్ని , హాయ్ నాన్న , సలార్ సినిమాలతో మరో రెండు విజయాలను అందుకుంది.

ఇకపోతే ఈ బ్యూటీ మరికొన్ని రోజుల్లో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు ఓ కొత్త దర్శకుడితో శృతి హాసన్ ప్రధాన పాత్రలో ఓ హార్రర్ జోనర్ లేడీ ఓరియంటెడ్ మూవీ ని రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన బాగుమతి లేడీ ఓరియంటెడ్ సినిమాను నిర్మించారు. ఈ మూవీ తర్వాత వీరు లేడీ ఓరియంటెడ్ మూవీ తీయలేదు. దానితో శృతి హాసన్ తో తీయబోయే లేడీ ఓరియంటెడ్ మూవీ పై ప్రత్యేక దృష్టి ని ఈ బ్యానర్ వారు పెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: