కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులలో సూర్య ఒకరు . ఈయన ఇప్పటికే ఎన్నో తమిళ సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును కోలీవుడ్ ఇండస్ట్రీలో దక్కించుకున్నాడు . ఇకపోతే సూర్య చాలా కాలం క్రితం ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం లో రూపొందిన గజినీ అనే మూవీ తో తెలుగు లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత నుండి సూర్య దాదాపుగా తాను నటించిన ప్రతి సినిమాను తెలుగులో విడుదల చేస్తూ వస్తున్నాడు.
అందులో కొన్ని మూవీలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూర్య , శివ దర్శకత్వంలో రూపొందుతున్న కంగువా అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాలో థియేటర్ హక్కులను అమ్మ వేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులను కూడా అమ్మివేసింది.
ఈ మూవీ యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులను మైత్రి సంస్థ వారు దక్కించుకున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇక మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నైజాం ఏరియాలో అత్యంత పెద్ద స్థాయిలో విడుదల చేయడానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక భారీ అంచనాలు కలిగి ఉన్న సినిమా కావడంతో మైత్రి సంస్థ వారు ఈ సినిమా యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.