ఒక్క మాటతోనే "ఇండియన్ 2" పై అంచనాలు పెంచేసిన కమల్..?

MADDIBOINA AJAY KUMAR
లోకనాయకుడు కమల్ హాసన్ తాజాగా ఇండియన్ 2 అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి దేశంలోనే గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వారిలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వం వహించగా ... సిద్ధార్థ్ , కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ ఈ మూవీ లో ముఖ్య పాత్రాలలో నటించారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ మూవీ ని లైకా ప్రొడక్షన్స్ , రెడ్ గ్లాంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీ ని జూలై 12 వ తేదీన తమిళ్ , తెలుగు , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

ఇండియన్ 2 తో పాటు ఇండియన్ 3 కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల కాబోతుంది. ఇండియన్ 2 సినిమా చిత్రీకరిస్తున్న సమయంలోనే ఇండియన్ 3 కు సంబంధించిన చాలా భాగం సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇక ఇండియన్ 2 మూవీ విడుదల అయిన తర్వాత ఆరు నెలలకే ఇండియన్ 3 రిలీజ్ కాబోతున్నట్లు ఈ మూవీ బృందం వారు చెబుతూ వస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ వరస ఇంటర్వ్యూలలో , టీవీ షో లలో పాల్గొంటుంది. అందులో భాగంగా తాజాగా కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

అందులో భాగంగా ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా నాకు ఇండియన్ 2 కంటే ఇండియన్ 3 పై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇండియన్ 3 కథ కూడా అంతా గొప్పగా ఉంటుంది అని చెప్పాడు. ఇక ఇండియన్ 2 విడుదల కాకముందే ఇండియన్ 3 గురించి అంత పాజిటివ్ గా చెబుతున్నాడు అంటే ఇండియన్ 2 ఎండింగ్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది అని జనాలు భావిస్తున్నారు. కమల్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఇండియా 2 పై అంచనాలు ప్రేక్షకుల్లో భారీగా పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: