పవన్ లాంచింగ్ కోసం చిరు ఆ సమయంలో అంతా రిస్క్..?

MADDIBOINA AJAY KUMAR
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ పరిశ్రమలో ఎవరి బ్యాగ్రౌండ్ లేకుండా అత్యున్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు.  చిరు ఎవరి బ్యాగ్రౌండ్ లేకుండా ఇంట్రెస్ట్ లోకి వచ్చి స్టార్ హీరోగా మారడంతో ఈయనను ఆదర్శంగా తీసుకొని ఇప్పటికే ఎంతో మంది సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఎంతో మంది సూపర్ గా సక్సెస్ కూడా అయ్యారు. ఇకపోతే సినీ పరిశ్రమలో తాను అద్భుతమైన స్థాయిలో ఉన్న సమయం.లోనే తన సోదరుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ ను కూడా హీరోగా ఎంట్రీ ఇప్పించాలి అని చిరంజీవి భావించాడు.

అందులో భాగంగా పవన్ కళ్యాణ్ లాంచ్ అయ్యే సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకోవాలి అని చిరంజీవి అనేక ప్లాన్స్ వేశాడు. అందులో భాగంగా ఆ సమయంలో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడు అయినటువంటి ఏవి సత్యనారాయణ ను దర్శకుడిగా సెట్ చేసాడు. ఇక సినిమా కథ విషయానికొస్తే కొత్త కథతో కాకుండా రీమేక్ తో పవన్ కళ్యాణ్ ని లాంచ్ చేయాలని అనుకున్నారట. అందుకోసం బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నటించిన ఖయామత్ సే ఖయామత్ తక్ అనే మూవీని తెలుగులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టైటిల్ తో కథ సిద్ధం చేయించారు.  

ఇక అల్లు అరవింద్ అయితే ఈ సినిమా బాధ్యతలను బాగా నిర్వహిస్తాడు అని ఆయనకు ఈ సినిమా బాధ్యతలను చిరు అప్పగించాడు. జనాల్లో ఈ సినిమాపై పెంచడానికి చిరు ఆ సమయంలో అనేక ప్రచారాలను చేయించాడు. ఈ సినిమా కోసం పవన్ కి జోడిగా అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు అయిన సుప్రియ ను ఎంపిక చేశారట. రెండు పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్న వారసుల సినిమా కాబట్టి దీనిపై ఎక్స్పెక్టేషన్స్ గట్టిగా ఏర్పడతాయని అందరు ఆ సమయంలో నమ్మారట. 1996 లో విడుదలైన ఈ సినిమా 32 సెంటర్లో 50 రోజులు పూర్తి చేసుకోగా రెండు సెంటర్స్ లో వంద రోజులు పూర్తి చేసుకుని మంచి విజయాన్ని అందుకొని పవన్ కళ్యాణ్ కి మంచి లాంచింగ్ మూవీ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: