కల్కి 2898AD: ఐదు నిమిషాల సీన్ కోసం.. రౌడీ హీరో ఎంత తీసుకున్నాడు అంటే..?
600 కోట్ల భారీ బడ్జెట్ రూపొందిన ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 298.5 కోట్లు రాబట్టింది. ఇక ఈ చిత్రంలోని విజువల్స్ అండ్ యాక్షన్ సీన్స్ మరియు మహాభారతం సీన్స్ అన్ని అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే కల్కి సినిమాలో ఊహించని ట్విస్టులతో పాటు పాత్రలతో అలరించాడు నాగ్ అశ్విన్. ప్రధాన తారాగణంతో పాటు ఈ మూవీలో మాలిక నాయక్, శోభన, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అర్జీవి, ఎస్ ఎస్ రాజమౌళి, మృణాల్ ఠాకూర్, ఫరియా అబ్దుల్లా. నవదీప్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు.
ఇక వీరందరి గెస్ట్ ట్రోల్స్ అభిమానులకి ఊహించని సర్ప్రైజ్లు ఇచ్చాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అర్జున్ డి పాత్రలో కనిపించాడు. కల్కి మూవీలో చివరిలో ఐదు నిమిషాల పాటు కనిపించిన విజయ్ ఈ సినిమాలో అర్జునుడిగా కనిపించేందుకు మాత్రం ఎలాంటి రెమ్యూనరేషన్ పుచ్చుకోలేదట. నాగ్ అశ్విన్ కథ చెప్పగానే వెంటనే తాను నటించేందుకు రెడీ అన్నాడని అందుకు ఎటువంటి పారిదోషకం తీసుకోలేదని సమాచారం. అదేవిధంగా కల్కి సెకండ్ పార్ట్ లో కూడా విజయ్ పోషించిన పాత్రకి మరిన్ని సీన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. మొదటి భాగంలో విజయ్ దేవరకొండ పెద్దగా కనిపించకపోయినా రెండవ భాగంలో విజయ్ దేవరకొండ పాత్రకి మంచి ప్రాధాన్యత ఉండబోతున్నట్లు సమాచారం.