కల్కి 2898 AD: పార్ట్ 2 రిలీజ్ ఎప్పుడంటే?

Purushottham Vinay
కల్కి 2898 AD: పార్ట్ 2 రిలీజ్ ఎప్పుడంటే?   
రెండో రోజు కూడా కల్కికి సూపర్ వసూళ్లు.. అఫీషియల్ పోస్టర్ రిలీజ్? పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా మూవీ కల్కి 2898 AD.గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చాలా గ్రాండ్ గా విడుదలైంది. ఈ మూవీ ఫస్ట్ షో నుంచి అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతన్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు 191 కోట్లకి పైగా ఈ సినిమా వసూళ్ళని సాధించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ రెండవ రోజు లెక్కలు కూడా బయటకొచ్చాయి. ఈ మేరకు సినిమా యూనిట్ ఒక అధికారిక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ఇంకా కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను మహానటి సినిమాతో సత్తా చాటిన యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు.


 ఇక అటు విమర్శకులతో పాటుగా ప్రేక్షకుల నుండి కూడా పాజిటివ్ రివ్యూస్ పొందిన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 191.50 కోట్ల భారీ వసూళ్లు సాధించగా రెండో రోజుకి ప్రపంచ వ్యాప్తంగా 298.50 కోట్లని వసూలు చేయడం జరిగింది. ఇక ఈ సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన అశ్వినీ దత్ ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ పార్ట్ రిలీజ్ గురించి గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.వచ్చేయడాది ఇదే సమయంలో రిలీజ్ చేసే అవకాశం ఉందని అన్నారు.  కల్కి సినిమాటిక్ యూనివర్స్ నుంచి ప్రస్తుతానికి ఈ రెండు భాగాలు మాత్రమే రిలీజ్ చేయాలనుకున్నామని ఈ రెండు రిలీజ్ అయిన తర్వాత అవకాశం ఉంటే మళ్లీ ఈ యూనివర్స్ లో భాగంగా సినిమాలు చేస్తారేమో నాగ్ అశ్విన్ నిర్ణయానికే వదిలేస్తున్నామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: