కల్కి 2898 AD : ఎన్నో స్పెషల్ క్యామియోలు.. కానీ గుర్తింపు ఆ ఒక్కరికే.. ఎందుకంటారు..?

MADDIBOINA AJAY KUMAR
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD అనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ నిన్న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదలకు ముందు చాలా రోజుల నుండి ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని , దుల్కర్ సల్మాన్ , విజయ్ దేవరకొండ , ఎస్ ఎస్ రాజమౌళి చిన్న చిన్న పాత్రలలో నటించబోతున్నట్లు అనేక వార్తలు వచ్చాయి.

ఇక ఈ వార్తలను చాలా మంది రూమర్స్ గానే కొట్టి పారేశారు. ఈ మూవీ విడుదలకు ఒక రోజు ముందు ఈ మూవీ దర్శకుడు అయినటువంటి నాగ్ అశ్విన్ ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ , విజయ్ దేవరకొండ నటించారు అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఇక సినిమా విడుదల అయ్యింది. వీరితో పాటు ఈ సినిమాలో ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలో ఉన్నాడు అన్నట్లు పెద్దగా రూమర్స్ కూడా ఏమీ రాలేదు. సడన్ గా ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ కనిపించడంతో థియేటర్ అంతా సందడి వాతావరణం నెలకొంది. 

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ , ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ ఇంతమంది చిన్న చిన్న పాత్రలలో నటించిన కూడా వీరందరి కంటే కూడా గొప్ప గుర్తింపు ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండకు వచ్చింది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో అర్జునుడి పాత్రలో కనిపించాడు. ఇక ఈ పాత్ర ఎంతో బలమైనది కావడం , అలాగే ఈ సినిమా మొదటి భాగంలో విజయ్ దేవరకొండ పాత్రకు ఎండింగ్ ఇవ్వకపోవడంతో ఈయన పాత్రకు ఈ మొదటి భాగంలో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇక ఇప్పటికే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఎవడే సుబ్రహ్మణ్యం , మహానటి సినిమాలలో కూడా విజయ్ దేవరకొండ ముఖ్య పాత్రలలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: