కల్కి 2898 AD : మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు ఇవే.. షేర్.. గ్రాస్.. టోటల్ వివరాలు..!

Pulgam Srinivas
ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా నిన్న అనగా జూన్ 27వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా, వైజయంతి మూవీస్ స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ మూవీ ని అశ్విని దత్ కూతురు స్వప్న దత్ నిర్మించింది. ఈ సినిమాలో అమితా బచ్చన్ , దీపికా పదుకొనే కీలక పాత్రలలో నటించగా ... కమల్ హాసన్ విలన్ పాత్రలో నటించాడు. దిశ పటని ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా , రాజేంద్ర ప్రసాద్ , బ్రహ్మానందం , శోభన , మృణాల్ ఠాకూర్ , విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ , ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ ఈ మూవీ లో చిన్న చిన్న పాత్రలలో నటించారు.

ఇకపోతే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి షో కే అద్భుతమైన బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కాయి. మరి ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు ఎన్ని కోట్ల షేర్ ... గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాకు ఇంకా ఎన్ని కోట్ల దూరంలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 44.86 కోట్ల షేర్ 70.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి కర్ణాటకలో మొదటి రోజు 5.75 కోట్ల షేర్, 12.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. తమిళనాడు ఏరియాలో 2.35 కోట్ల షేర్ , 5.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి  కేరళలో 1.35 కోట్ల షేర్, 2.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీ కి 12.85 కోట్ల షేర్ , 30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

ఈ మూవీ కి ఓవర్సీస్ లో 29 కోట్ల షేర్, 62.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా మొదటి రోజు ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 96.16 కోట్ల షేర్, 183.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 370 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ లోకి దిగింది. ఈ మూవీ మరో 275.84 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: