కల్కి 2898 AD : యూఎస్ లో ప్రభాస్ హిస్టరీ.. ఆ ఇద్దరు స్టార్ హీరోల రికార్డ్ అవుట్..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా కల్కి. ఇక ఈ సినిమా నిన్న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. బ్లాక్ బస్టర్ టాక్ తో రెండవ రోజు దూసుకుపోతోంది. ఈ సినిమా కేవలం మొదటి రోజే దాదాపుగా 200 కోట్ల వసూళ్లను సాధించింది.  అయితే క్రమంగా వరుస సినిమాలను చేస్తూ ఫ్యాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపును సంపాదించుకుంటున్నాడు ప్రభాస్. ఇక కల్కి సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాతో సరికొత్త రికార్డులను అందుకుంటున్నడు ప్రభాస్.  కల్కి సినిమాతో సరికొత్త హిస్టరీని

 నమోదు చేశాడు. ఆ వివరాలు ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన పాన్ వరల్డ్ సినిమా కల్కి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ దాదాపుగా 600 కోట్ల తో నిర్మించిన ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించింది. అలాగే అమితాబచ్చన్ కమలహాసన్ వంటి లెజెండ్ యాక్టర్స్ పలు కీలక పాత్రలో కనిపించారు. దిశా పటాని సైతం ఒక ముఖ్య పాత్రలో కనిపించింది. ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' మూవీ రిలీజ్ జూన్ 27వ తేదీన ఉండడంతో ఓవర్సీస్‌లో

 దీనికి సంబంధించిన బుకింగ్స్ 20 రోజుల ముందే ఓపెన్ అయ్యాయి. అక్కడ ఈ చిత్రానికి భారీ రెస్పాన్స్ కూడా వస్తోంది. దీంతో విడుదలకు ముందే ప్రభాస్ సినిమా నార్త్ అమెరికాలోనే రూ. 30 కోట్లు వరకూ గ్రాస్ వసూళ్లు కూడా సాధించింది. మిగిలిన ప్రాంతాల కంటే నార్త్ అమెరికాలో 'కల్కి 2898 ఏడీ' సినిమాకు మరింత ఎక్కువ స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం ఒక్క ప్రీమియర్స్ ద్వారానే 3.85 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. తద్వారా అత్యధిక ప్రీమియర్స్‌ కలెక్షన్లు సాధించిన సినిమాగా ఇది రికార్డు సాధించింది. తద్వారా ప్రభాస్.. షారూక్ ఖాన్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ సినిమాలను వెనక్కి నెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: