సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథలో వేరే హీరో నటించడం అవి బ్లాక్ బస్టర్ అయిన సందర్భాలు అనేకం ఉంటాయి. ఇకపోతే కొంత మంది హీరోలు కథ నచ్చక రిజెక్ట్ చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సందర్భాలు ఉంటే, మరి కొంత మంది మాత్రం ఆ సినిమా కథ సూపర్ గా ఉండి , ఆల్మోస్ట్ ఆ సినిమా తీస్తే హిట్ అవుతుంది అని తెలిసినా కూడా తమపై ఆ సినిమా వర్కౌట్ కాదు అని , అలాగే అలాంటి జోనర్ సినిమాలో వారు అంతకు ముందు అనేకం నటించడంతో సినిమా కథ బాగున్న వదులుకోన్న సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాడు. అలాగే తాను రిజెక్ట్ చేసిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయం సాధించిన మూవీస్ ను కూడా ఉన్నాయి. అలా పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన ఓ భారీ బ్లాక్ బాస్టర్ మూవీ నువ్వే కావాలి. ఇకపోతే పవన్ ఈ సినిమాను ఎందుకు రిజెక్ట్ చేశాడు అనే వివరాలను తెలుసుకుందాం. తరుణ్ హీరోగా రీచా హీరోయిన్గా విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన నువ్వే కావాలి సినిమా 2000 సంవత్సరం విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించింది.
ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ , స్క్రీన్ ప్లే , మాటలు అందించాడు. మొదటగా ఈ సినిమా కథను పవన్ కళ్యాణ్ కు వినిపించారట. పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా కథ సూపర్ గా నచ్చినప్పటికీ పవన్ ఆ సమయంలో గోకులంలో సీత , తొలిప్రేమ లాంటి ప్రేమ కథ చిత్రాలలో హీరోగా నటించి ఉండడంతో మరోసారి ప్రేమ కథ చిత్రాలలో నటిస్తే ప్రేక్షకులు తిరస్కరించే అవకాశం ఉంది అని నేపథ్యంలోనే ఈ సినిమాను వదులుకున్నాడట. కానీ ఆ తర్వాత ఈ సినిమాను తరుణ్ హీరోగా రూపొందించగా ఇది అద్భుతమైన విజయం సాధించింది.