అక్కడికి వెళ్లడానికి శ్రీముఖి దగ్గర అప్పు చేశా.. అవినాష్ షాకింగ్ కామెంట్స్..!

lakhmi saranya
జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్స్ మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. అలా మంచి పాపులారిటీని సంపాదించుకున్న వారిలో అవినాష్ కూడా ఒకరు. జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా చేరి ముక్కు అవినాష్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు ఈ కమెడియన్. ఇక అనంతరం టీం లీడర్ గా కూడా మారాడు. ప్రస్తుతం అవినాష్ సినిమాల్లో కమీడియన్ గా వలస చాన్స్ లో అందుకుంటున్నాడు. అయితే జబర్దస్త్ నుంచి అవినాష్ బిగ్ బాస్ కి వెళ్లిన సంగతి తెలిసిందే.
జబర్దస్త్ లో ఆ షో నిర్మాణ సంస్థలో చేసేవారికి అక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో పాటు ఇన్నాళ్లు చేయాలని బాండ్ కూడా ఉంటుంది. ఇక ఆ బాండ్ మధ్యలో బ్రేక్ చేసి వెళ్తే ఆ నిర్మాణ సంస్థకి భారీగా ఫైన్ కట్టాల్సిందే. అయితే అవినాష్ జబర్దస్త్ చేస్తున్నప్పుడే బిగ్ బాస్ అవకాశం రావడంతో ఆ బాండ్ బ్రేక్ చేసి బిగ్ బాస్ కి వెళ్ళాడు. ఇక ఎందుకు జబర్దస్త్ నిర్మాణ సంస్థకు అవినాష్ 10 లక్షల రూపాయలు ఫైన్ కట్టినట్లు ఇటీవల ఇంటర్వ్యూలో తెలియజేశారు.
ఆయన మాట్లాడుతూ.." బిగ్ బాస్ షో కి వెళ్లే సమయంలో నా దగ్గర అంత డబ్బు లేకపోవడంతో యాంకర్ శ్రీముఖి దగ్గర ఐదు లక్షలు మరొకరి దగ్గర ఐదు లక్షలు తీసుకుని ఆ ఫైన్ కట్టాను. అప్పుగా తీసుకున్న ఆ పది లక్షలు కూడా బిగ్ బాస్ నుంచి తిరిగి రాగానే ఇచ్చేసా. బిగ్బాస్ వల్ల నాకు ఫైనాన్షియల్ గా బాగానే డబ్బులు వచ్చాయి. అదేవిధంగా తరువాత టీవీ సినిమాల్లో కూడా మంచి ఛాన్సులు వచ్చాయి " అంటూ తెలియజేశాడు అవినాష్. ప్రజెంట్ అవినాష్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అవినాష్ వ్యాఖ్యలని విన్న పలువురు శ్రీముఖిని ప్రశంసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: