క‌ల్కి 2898 AD : క‌థా లేదు కాక‌ర‌కాయా లేదు... ఈ సీన్లు కోసం సినిమా చూడాల్సిందే..?

lakhmi saranya
ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపొందిన కల్కి మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా రివ్యూలు పడ్డాయి. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ మూవీలో ప్రభాస్ తో పాటు అమితాబచ్చన్ అండ్ కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని వంటి స్టార్లు నటించారు. ఈ మూవీ నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి ఆదరణ దక్కింది. ఇక ఈ మూవీ లో అమితాబచ్చన్ అశ్వద్ధామ పాత్రలో కనిపించారు.
ఇక కమల్ హాసన్ కలి అనే పాత్రలో కనిపించారు. ఇప్పుడు నడుస్తున్నది కలయుగం. కలి ప్రభావం గురించి భాగవతంలో వ్యాస మహర్షి తెలిపారు. ఇక ఈ పోతన గారు ఆ భాగవతాన్ని తెలుగులోకి అనుమతించారు. ఇక ఈ మూవీ లో పెద్ద కథ లేకపోయినా ఒకపక్క అమితాబచ్చన్ అండ్ మరోపక్క కమల్ హాసన్ యాక్టింగ్ లు బాగుండడం వల్ల సినిమాని చూడవచ్చు. అయితే అమితాబచ్చన్ ఒక ప్రధాన పాత్రలో పోషిస్తుంటే ఇంకో ప్రధాన పాత్రలో ప్రభాస్ నటించాడు. భైరవ అంటే ఈశ్వరుడు అని కూడా అర్థం వస్తుంది.
ఇక ఇక్కడ ఇంకో ఆసక్తికర అంశం ఏమిటంటే.. నేపాల్ దేశంలో పాండవులతో అతి బలసంపన్నుడు ఆయన భీముడిని దేవుడుగా కొలుస్తాం. అక్కడ భీముడికి అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇక అక్కడ భీముడిని భైరవుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి నాగ్ అశ్విన్ తీసుకున్న భైరవ పాత్ర నేపాల్ లో పూజించే భీముడి కి స్ఫూర్తిగా ఏమైనా తీసుకున్నారా.. అనే సన్నివేశం ఈ మూవీలో హైలెట్గా ఉంటుంది. కలియుగంలో కలి  ఎలా ఉంటాడు అనే విషయంలో అతని వర్ణన కూడా చాలా ఏహ్యంగా ఉంటుంది. ప్రభాస్ అంటే అమితాబచ్చన్ మధ్య జరిగే సన్నివేశాలను ప్రేక్షకులను విభక్షంగా ఆకట్టుకుంటాయి. సినిమాలో పెద్దగా కదా కాకరకాయ లేకపోయినా ఈ సన్నివేశాల గురించి అయితే సినిమాని చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: