కల్కి 2898 AD: బాక్సాఫీస్ బద్దలే.. ఒక్క ఇండియాలోనే అన్ని కోట్లు కలెక్ట్..??

Suma Kallamadi
* నేడే ప్రభాస్ దీపిక నటించిన కల్కి మూవీ రిలీజ్
* ఈ మూవీని చూసేందుకు ఎగబడుతున్న ప్రేక్షకులు  
* ఫస్ట్ డే కలెక్షన్స్ తో రికార్డు బద్దలు  
ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించిన నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రం "కల్కి 2898 AD" జూన్ 27 న థియేటర్లలో విడుదల అయింది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రిపోర్ట్స్ ప్రకారం, ఈ మూవీ ఫస్ట్ డే భారతదేశంలో రూ.55.05 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుందని అంచనా.
"కల్కి 2898 AD" చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో 2D, 3D ఫార్మాట్లలో విడుదలవుతోంది. తెలుగు 2డిలో 872,237 టిక్కెట్లు, తెలుగు 3డిలో 554,159 టిక్కెట్లు అమ్ముడయ్యాయని అంచనా. రిపోర్ట్స్ ప్రకారం, బ్లాక్ చేసిన సీట్లు కాకుండా, ఈ చిత్రం భారతదేశంలో రూ.48.27 కోట్లు సంపాదించింది. బ్లాక్డ్‌ సీట్లతో, ఈ మూవీ రూ.55.05 కోట్లు రాబట్టిందని అంచనా. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అత్యధికంగా 71%, 62% ఆక్యుపెన్సీ రేట్లు వసూలు చేసింది, వరుసగా రూ.19.54 కోట్లు, రూ.13.48 కోట్లు ఆర్జించింది.
బుధవారం, "కల్కి 2898 AD" విడుదలకు ఒక రోజు ముందు, కమల్ హాసన్ సుప్రీమ్ యాస్కిన్‌గా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కమల్ హాసన్ తన పాత్ర గురించి మాట్లాడుతూ.. ‘‘విలన్‌కి అన్ని ఆసక్తికర అంశాలు, వినోదాలు ఉంటాయి కాబట్టి నేనెప్పుడూ విలన్‌గా నటించాలని అనుకుంటున్నా. హీరోలు రొమాంటిక్ పాటలు పాడుతూ హీరోయిన్ కోసం ఎదురు చూస్తున్నారు. నేను విలన్‌గా నటిస్తానని అనుకున్నాను, కానీ నాగ్ (దర్శకుడు) సినిమాలో నేను దాదాపుగా జ్ఞానిలానే ఉంటాను." అని అన్నారు
 "ఎవడే సుబ్రమణ్యం", "మహానటి" తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మూడవ చిత్రం "కల్కి 2898 AD".  ఈ సినిమాలో ప్రభాస్ భైరవ అనే బౌంటీ హంటర్‌గా నటిస్తున్నాడు. కీర్తి సురేష్ తన AI డ్రాయిడ్ సైడ్‌కిక్, బుజ్జి కి గాత్రదానం చేసింది. అమితాబ్ బచ్చన్ కల్కి అవతారాన్ని రక్షించే లక్ష్యంతో అశ్వత్థామగా నటించారు.  దీపికా పడుకునే సుమతి పాత్రలో, పరారీలో ఉన్న గర్భిణీ స్త్రీగా మెరిసింది. కమల్ హాసన్ విలన్ సుప్రీం యాస్కిన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: