బాబీ కోసం రాత్రిపూట కష్టపడుతున్న బాలయ్య... కారణం అదే..?

MADDIBOINA AJAY KUMAR
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ మూవీతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా కంటే ముందు కొంతకాలం బాలయ్య వరుస అపజాయలను ఎదుర్కొన్నాడు. అలాంటి సమయంలో అఖండ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో ఒక్క సారిగా బాలకృష్ణ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం కూడా ఆ ఫామ్ ను అలాగే కంటిన్యూ చేస్తూ వెళుతున్నాడు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఈయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించి మరో విజయాన్ని అందుకున్నాడు.

ఆ మూవీ తర్వాత భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఇలా ఇప్పటికే వరుసగా మూడు విజయాలను అందుకొని హైట్రిక్ ను కొట్టిన బాలయ్య ప్రస్తుతం బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీకి మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో "ఎన్ బి కే 109" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యొక్క చిత్రీకరణ జరుగుతుంది. తాజాగా ఈ మూవీ లేటెస్ట్ షూటింగ్ షెడ్యూల్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లో బాలకృష్ణ మరియు కొంతమంది ఇతరులపై రాత్రిపూట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు చిత్రీకరిస్తున్న ఈ రాత్రిపూట సన్నివేశాలు ఈ మూవీకే హైలైట్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ రెండు వీడియోలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. వరుస విజాయలతో జోష్ మీద ఉన్న బాలకృష్ణ హీరోగా నటిస్తున్న మూవీ కావడం , వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో తేరక్కెక్కుతున్న చిత్రం కావడంతో ఈ మూవీపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: