"ఫ్యామిలీ స్టార్" హిందీ "ఓటిటి" హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈ నటుడు తాజాగా ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా ... టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మించగా , గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
 

ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో మంచి అంచనాల నడుమ విడుదల అయింది. కాకపోతే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా ఆ తర్వాత తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషలలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు ఓ టి టి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

ఈ మూవీ హిందీ భాషలో మాత్రం ఓ టీ టీ లో విడుదల కాలేదు. తాజాగా ఈ సినిమా హిందీ వర్షన్ ఓ టి టి విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ డిజిటల్ హక్కులను జియో సినిమా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను జూన్ 28 వ తేదీ నుండి హిందీ భాషలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా హిందీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd

సంబంధిత వార్తలు: