మహేష్ తో ఓకే.. వెంకీతో అనిల్ రావిపూడికి సాధ్యమయ్యేనా..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో అనిల్ రావిపూడి ఒకరు. ఈయన పటాస్ అనే సినిమాతో దర్శకుడుగా కెరియర్ను మొదలు పెట్టి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆఖరుగా అనిల్ , బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. పటాస్ మూవీ నుండి భగవత్ కేసరి సినిమా వరకు ఈయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ మంచి విజయాలు అందుకోవడంతో ఈయన తెలుగు లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకుడుగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ దర్శకుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సరిలేరు నీకెవ్వరు అనే సినిమాను తెరకెక్కించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ను సంక్రాంతి పండుగకు నాలుగైదు నెలల ముందే మొదలు పెట్టారు. దానితో ఈ సినిమా సంక్రాంతి కి విడుదల కావడం కష్టమే అని చాలా మంది అనుకున్నారు. కాకపోతే అనిల్ పక్కాగా స్క్రిప్ట్ మొత్తాన్ని రెడీ చేసుకుని ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లడంతో అనుకున్న సమయానికి ఈ సినిమాను విడుదల చేయగలిగారు అనిల్. ఇకపోతే మహేష్ మూవీ కి ఫాలో అయిన స్ట్రాటజీనే అనిల్ రావిపూడి మరోసారి వెంకటేష్ మూవీ కి ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది.

అనిల్ మరికొన్ని రోజుల్లో వెంకటేష్ హీరోగా ఓ మూవీ ని స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల చేయాలి అనే ప్లాన్ లో అనిల్ ఉన్నాడు. దానితో స్క్రిప్ట్ మొత్తాన్ని పక్కాగా రెడీ చేసుకుని ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లాలి అని ఒక సారి స్టార్ట్ అయ్యింది అంటే జెట్ స్పీడ్ లో ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేసి వచ్చే సంవత్సరం సంక్రాంతి కి ఈ సినిమాను విడుదల చేయాలి అని అనిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మరి మహేష్ మూవీ కి జరిగినట్లే వెంకటేష్ మూవీ తో కూడా జరుగుతుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: