విజయ్ సేతుపతి అస్సలు తగ్గడం లేదు... 2వ వారం కూడా అదే పరిస్థితి..!

Pulgam Srinivas
విజయ్ సేతుపతి ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో హీరోగా , ముఖ్యమైన పాత్ర లలో , విలన్ పాత్రలలో నటించి తనదైన అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా ఈ నటుడు మహారాజా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి మంచి అంచనాల నడుమ జూన్ 14 వ తేదీన తమిళ , తెలుగు భాషలలో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు అద్భుతమైన టాక్ రావడంతో ప్రస్తుతం ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కుతున్నాయి.

అందులో భాగంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. అందులో భాగంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను ఎప్పుడో అందుకుంది. ఈ మూవీ కి ఇప్పటి వరకు ఎన్ని కోట్ల లాభాలు తెలుగు రాష్ట్రాల్లో వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.
11 రోజుల్లో ఈ సినిమాకి నైజాం ఏరియాలో 2.84 కోట్లు కలెక్షన్లు దక్కగా, సీడెడ్ లో 88 లక్షలు , ఆంధ్ర లో 2.05 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 11 రోజుల్లో కలిపి తెలుగు రాష్ట్రాల్లో 5.77 కోట్ల షేర్ , 11.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని ఇప్పటికే 2.27 కోట్ల లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs

సంబంధిత వార్తలు: