తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి
అల్లు అరవింద్ కుమారుడు అయినటువంటి
అల్లు శిరీష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన తన ఇంట్లోనే పెద్ద బ్యానర్ ఉన్నా కూడా తన బ్యానర్ ద్వారా తెరకెక్కి సినిమాలలో కాకుండా ఎక్కువ శాతం బయట బ్యానర్లలో తెరకెక్కే సినిమాలలోనే నటిస్తూ వస్తున్నాడు. ఈయన మొదటగా గౌరవం అనే సినిమాతో
వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ
సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్
మూవీ గా కాకుండా ఎంతో వైవిధ్యమైన కథాంశంతో రూపొందింది. కాకపోతే ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది.
ఈయన తన కెరియర్ లో ఇప్పటి వరకు చాలా సినిమాలలో హీరోగా నటించిన అందులో
పరశురామ్ దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి
హీరోయిన్ గా రూపొందిన శ్రీరస్తు శుభమస్తు
సినిమా తప్పితే ఈయనకు
బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ
సినిమా కూడా కమర్షియల్ గా మంచి విజయాన్ని అందించలేదు. ప్రస్తుతం ఈయన బడ్డీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ
సినిమా తమిళ్ లో
ఆర్య హీరోగా రూపొందిన టెడ్డీ అనే సినిమాకు
రీమేక్ గా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ
సినిమా యొక్క ట్రైలర్ ను రేపు విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం ప్రకటించింది. వరుస అపజాయలతో డీలా పడిపోయి ఉన్న శిరీష ఈ
మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్నాడు.
ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోవడం కష్టమే అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఎందుకు అంటే ఇప్పటికే తమిళంలో రూపొందిన టెడ్డి
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఇంపాక్ట్ ను ఏమీ చూపలేదు. అలాగే ఆ
సినిమా ఇప్పటికే తెలుగులో కూడా విడుదల అయింది. దానితో ఈ
సినిమా తెలుగు ప్రేక్షకులను మరి భారీ స్థాయిలో ఆలోచించడం కష్టమే అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.