బంపర్ ఆఫర్ కొట్టేసిన హైపర్ ఆది.‌.. త్వరలో ఎమ్మెల్యే పోస్ట్..!

lakhmi saranya
జబర్దస్త్ షో ద్వారా చాలామంది పాపులారిటీని సంపాదించుకుంటారు. అలా ఫేమస్ అయిన వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. తన కామెడీ టైమింగ్ లతో పంచులతో ప్రతి ఒక్కరిని కడుపుబ్బ నవ్విస్తాడు ఈ కమెడియన్. అదేవిధంగా మొన్న జరిగిన ఎన్నికల్లో పవన్ కోసం పిఠాపురం వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉండి ప్రచారం చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా తొలిసారి తెరిచి డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
జనసేన పార్టీ కోసం ఎటువంటి లభాపెక్ష లేకుండా కష్టపడ్డ హైపర్ ఆది కి మంచి పదవి ఇచ్చి గౌరవించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వంలో త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్యే స్థానంలో ఒకటి హైపర్ ఆదికి ఇవ్వాలని జనసేన డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఏక ఈ రకంగా తనను నమ్ముకుంటే భవిష్యత్తులో మంచి పదవులు వస్తాయనే సంకేతం ఇచ్చినట్లు అవుతుందనే ఉద్దేశంతో హైపర్ ఆదికి ఎమ్మెల్యే పదవి ఇవ్వబోతున్నారట. మొత్తంగా ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముందుగా హైపర్ ఆది సహా పార్టీ కోసం పని చేసిన సినిమా వాళ్లకు తగిన గౌరవం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
అయితే ఈ పదవులపై పవన్ కళ్యాణ్ ఇటు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో హైపర్ ఆది పై తెగ ప్రచారం జరుగుతుంది. దీనిపై ఆది లేదా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని స్పందిస్తే అసలు నిజాలు బయటికి వస్తాయి. కొన్ని సంవత్సరాలుగా జనసేనకి ఫుల్ సపోర్ట్ గా నిలబడ్డా హైపర్ ఆదికి జనసేన ఎమ్మెల్యే పదవి ఇవ్వడం కరెక్ట్ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.‌ మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో వేచి చూడాలి. ప్రస్తుతానికి అయితే హైపర్ ఆది ఫుల్ బిజీగా ఉన్నాడు. తన కామెడీ టైమింగ్ లతో పంచులతో ప్రతి ఒక్కరిని కడుపుబ్బ నవ్విస్తాడు ఈ కమెడియన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: