దీక్ష ప్రారంభించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సరికొత్త లుక్ వైరల్..!

lakhmi saranya
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న పవన్ ఇటీవల ఉపముఖ్యమంత్రిగా అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన సినిమాలకి బ్రేక్ ఇచ్చి తన పొలిటికల్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక నిన్ననే టాలీవుడ్ దగ్గర నిర్మాతలు అంతా కూడా పవన్ని కలిసేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే మీటింగ్ తరువాత పవన్  వారాహి అమ్మవారు దీక్ష చేపట్టనున్నారని వారి హ్యాండిల్స్ నుంచి ఈ సమాచారం బయటకు వచ్చింది. ఇక ఇప్పుడు నేటి నుంచే పవన్ ఈ దీక్షని ఆరంభించినట్లు కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి. మరి పవన్ కాషాయ వర్ణ దుస్తులలో ఈరోజు కనిపించి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచారు. అదే లుక్ లో తన కార్యాలయంలో పాల్గొన్నారు కూడా.
మరి పవన్ ఈ దీక్షని మొత్తం 11 రోజులు పాటుగా కొనసాగించనున్నట్లుగా ఈ దీక్షలో కేవలం ద్రవ, ఫలహారాలు మాత్రమే తీసుకుంటారట. ఇక ఇప్పుడు అయితే తన కొత్త లుక్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఇక హీరో కొత్త లుక్ ని చూసిన వారంతా.. విజయం తరువాత చాలామందిని చూశాం. ఇటువంటి దీక్షలు ఎవరు చేయలేదు. ఆ దేవుడే నీ వెన్నంటూ ఉండి గెలిపించాడు. ఇంత గొప్ప మెజారిటీ రావడానికి నువ్వు చేసిన పుణ్యమే కారణం అన్న. నీకు ప్రజలే కాదు దేవుడు సపోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. మీరు సినిమా ఇండస్ట్రీలోనే కాదు నిజజీవితంలో కూడా చెరగని ముద్రవేశారు. మీ ఫ్యాన్ గా మేము ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు నేటి నుంచే పవన్ ఈ దీక్షని ఆరంభించినట్లు కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: