తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు "కల్కి" టార్గెట్ అదే... ఆ సినిమాలను దాటగలదా..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా కల్కి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అమితా బచ్చన్ , దీపికా పదుకొనే , దిశా పటానీ కీలక పాత్రల్ నటించగా , కమల్ హాసన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ని జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాపై ప్రస్తుతానికి భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా టికెట్ రేట్లను భారీగా పెంచారు. దానితో మొదటి రోజు ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది అనే అంచనాలను అనేక మంది వేస్తున్నారు.

ఇకపోతే ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమ నుండి విడుదల అయిన సినిమాలలో రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 74.11 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ కలెక్షన్లను మొదటి రోజు వసూలు చేసిన సినిమాలు లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది.

ఆ తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ సినిమా 50.49 కోట్ల షేర్ కలెక్షన్లతో రెండవ స్థానంలోనూ , ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమా 43 కోట్ల షేర్ కలెక్షన్ లతో మూడవ స్థానంలోనూ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం సినిమా 38.88 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలోనూ , మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సైరా నరసింహా రెడ్డి సినిమా 38.75 కోట్ల షేర్ కలెక్షన్లతో 5 వ స్థానంలో నిలిచింది. కల్కి సినిమాకు గనక మంచి పాజిటివ్ టాక్ వచ్చినట్లు అయితే టాప్ 5 స్థానాలలో నిలిచే అవకాశం ఉంది అని చాలా మంది అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: