డార్లింగ్ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పిన అమితాబచ్చన్.. అసలు మ్యాటర్ ఏంటంటే..!?

Anilkumar
డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ సినిమా కల్కి. ఈ సినిమా విడుదల కి మరో రెండు రోజులు మాత్రమే ఉండడంతో దీనికి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలు జరుపుతున్నారు చిత్ర బృందం. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ తోపాటు లెజెండరీ యాక్టర్స్ అయిన అమితాబచ్చన్ కమలహాసన్ సైతం కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ప్రభాస్ కి జోడిగా దీపికా పదుకొనే కనిపించబోతోంది. అయితే చాలా కాలం తర్వాత అమితాబచ్చన్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భారీ బడ్జెట్ తో

 వస్తున్న ఈ సినిమాలో అమితాబచ్చన్ పాత్రా చాల కీలకంగా ఉండబోతుందని అంటున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి, ఇకపోతే ఈ సినిమా భారతీయ పురాణాలను ఆధారంగా తీసుకొని సైన్స్ ఫిక్షన్ డ్రామా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని జోరుగా నిర్వహిస్తున్నారు చిత్ర బృందం. అయితే తాజాగా ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు అమితాబచ్చన్. అసలు ఏం జరిగింది ఎందుకు ప్రభాస్ అభిమానులకు

 ఆయన క్షమాపణలు చెప్పారు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా చిత్రయూనిట్ నిర్వహించిన చిట్ చాట్ లో పాల్గొన్న ఆయన.. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ఓ విషయం చెబుతూ క్షమాపణలు కోరాడు. కల్కి మూవీ ప్రమోషన్లలో భాగంగా అమితాబ్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణేతోపాటు నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్నదత్ వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా విశేషాలను, షూటింగ్ ముచ్చట్లు పంచుకున్నారు. అయితే ఈ మూవీలో ప్రభాస్‏ను అమితాబ్ బచ్చన్ కొట్టే సీన్స్ ఉంటాయని.. చూసిన తర్వాత తనపై దాడి చేయొద్దని.. అందుకే ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెబుతున్నానని సరదాగా అన్నారు అమితాబ్. దీంతో అందరూ మీ ఫ్యాన్సే అంటూ అమితాబ్ తో అన్నారు ప్రభాస్...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: