ఇదెక్కడ ట్విస్ట్... వారికి పెద్ద షాక్ ఇచ్చిన న్యూస్ బ్రాడ్ కాస్ట్..?

Pulgam Srinivas
గత కొన్ని రోజులుగా ఆంధ్ర ఏరియాలో కొన్ని టీవీ ఛానల్ ను బ్యాన్ చేయబోతున్నారు అని వార్తలు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. దానితో అనేక మంది ఇవి కేవలం రూమర్స్ మాత్రమే చానల్స్ ను బ్యాన్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు. అలాంటి పని జరగడం ఆసంభవం అని చాలా మంది అనుకున్నారు. ఇకపోతే తాజాగా సాక్షి ఛానల్ తో పాటు టీవీ 9 , N టీవీ , 10 టీవీ తదితర ఛానల్ లో ప్రసారాన్ని తాజాగా నిలిపివేశారు.

దానితో న్యూస్ బ్రాడ్ కాస్ట్ అథారిటీ సంచలన ప్రకటన చేసింది. సంపాదకీయ స్వేచ్ఛపై జోక్యం తగదు. కేబుల్ టీవీ ఆపరేటర్లు ఈ ఛానళ్ల ప్రసారాన్ని నిలిపి వేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఎలాంటి కారణాలు లేకుండా ఛానల్ ల ప్రసారాన్ని నిలిపి వేయడం పూర్తిగా వ్యతిరేకం అని. తక్షణమే ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి అని కూడా నివేదించింది. ప్రజాస్వామ్య దేశంలో వేరు వేరు విధానాలుగా సమాచారం పొందడం ప్రజల హక్కు అని , వాటిని హరించే హక్కు ఎవరికీ లేదు అని తెలియజేసింది. మీడియా యొక్క గొంతు నొక్కే ఏ ప్రయత్నాన్ని అయినా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆపివేయాలి అని తెలియజేస్తుంది.

మరి తాజాగా ఈ సంస్థ కొన్ని టీవీ చానల్లో ప్రసారాన్ని ఆంధ్రాలో నిలిపి వేయడంపై ఈ స్థాయిలో స్పందించింది. దానితో వీలైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రసారం నిలిపివేసిన ఛానళ్లు మళ్లీ అందుబాటులోకి వస్తాయి అని జనాలు భావిస్తున్నారు. మరి ఈ ఛానల్ ఎప్పటి నుండి ప్రచారంలోకి వస్తాయా అనేది చూడాలి. ఇకపోతే కొంత మంది ప్రేక్షకులు కూడా ఈ ఛానల్ ను త్వరగా మళ్లీ ప్రసారం లోకి తీసుకురావాలి అని కోరుకుంటున్నా వారు కూడా ఉన్నారు. మరి అలాంటి వారి కోరిక మేరకు కూడా ఈ ఛానల్ ను అందుబాటులోకి తెస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: