వావ్ : రజినీ - సల్మాన్ కాంబో.. సెట్ అయితే ఆ రికార్డ్స్ బ్రేక్..!

Divya
సాధారణంగా ఈ మధ్యకాలంలో అన్నీ మల్టీ స్టారర్ మూవీలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరోలు కూడా ఇంకో హీరోతో జతకట్టి సక్సెస్ పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొన్ని ఎప్పుడు వచ్చే కాంబోలే కాకుండా మరికొన్ని రేర్ కాంబినేషన్లు కూడా ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తూ ఉంటాయి.  ఇప్పుడు అలాంటి కాంబోనే అటు బాలీవుడ్ ఇటు సౌత్ ఇండస్ట్రీలో తెగ ఆసక్తిని కలిగిస్తోంది.. మరి ఆ కాంబో విషయానికి వస్తే సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్.. బాలీవుడ్ కండలు వీరుడు సల్మాన్ ఖాన్ కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు తెరపైకి వచ్చింది.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
అసలు విషయంలోకెళితే.. ప్రముఖ డైరెక్టర్ అట్లీ..  అల్లు అర్జున్ కోసం ఒక కథ రాసుకున్న విషయం తెలిసిందే. అయితే అక్కడ ఎగ్జిట్ అవ్వడంతో సల్మాన్ ఖాన్ వద్దకు వచ్చి చేరింది. అయితే ఈ కథ బన్నీ కోసం రాసుకున్నదా లేక సల్మాన్ ఖాన్ కోసం రాసుకున్నదా అన్నది తెలియదు కానీ.. ఇద్దరి కాంబినేషన్లో సినిమా అనేసరికి అంచనాలు పీక్స్ కి చేరాయి.. ఇప్పుడు అంచనాలు అంతకంతకూ రెట్టింపు చేస్తూ అట్లీ దీనిని పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీగా మార్చే పనిలో పడ్డారని చెప్పవచ్చు.

అందులో భాగంగానే బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ సౌత్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ లను ఆయన లాక్  చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం అట్లీ రజినీకాంత్ తో చర్చలు జరుపుతున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం లభించింది.. ఈ కాంబో గనక సెట్ అయితే.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇదే భారీ మల్టీస్టారర్ అవుతుంది అనడంలో సందేహం లేదు.. ఒక్క నార్త్ ఫిలిం ఇండస్ట్రీలో 500 కోట్ల రూపాయలు ఈజీగా సంపాదించగలిగే కెపాసిటీ సల్మాన్ ఖాన్ కి ఉంది.. అలాగే సూపర్ స్టార్ కూడా సౌత్ నుంచి రూ .500 కోట్లు ఈజీగా వసూలు చేయగలరు.. అలాంటి ఇద్దరు కలిస్తే అది ఎలా ఉంటుందో ఇప్పుడు సంచలనంగా మారింది.. ఒకవేళ ఇదే నిజమైతే ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్ని ఈ హీరోలు ఇద్దరు బ్రేక్ చేస్తారనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: