కల్కి ఫస్ట్ డే వసూళ్లతో RRR, సలార్, బాహుబలి రికార్డులు మాయమవడం పక్కా?

Purushottham Vinay
పెరిగిన టికెట్ ధరలతో పాటు అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ చేయడం వల్ల సినిమాలకు మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి.సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే రెండు వారల పాటు స్థిరమైన కలెక్షన్స్ తో తెలుగు సినిమా చాలా ఈజీగా 500+ కోట్లు వసూళ్లు సాధించగలుగుతున్నాయి. ఈ సంవత్సరం హనుమాన్ మూవీ స్లో గా స్టార్ట్ అయ్యి పాన్ ఇండియా లెవల్ లో సక్సెస్ అందుకొని 300+ కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ అందుకోవాలని రికార్డ్స్ కొట్టాలని స్టార్ హీరోలు అనుకుంటున్నారు. అయితే ఇప్పటి దాకా ఎవరికి ఆ నెంబర్ టచ్ చేయడం సాధ్యం కాలేదు. కానీ కల్కి 2898ఏడీ మూవీతో ప్రభాస్ ఏకంగా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


ఇప్పటి దాకా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమాల జాబితాలో ఆర్ఆర్ఆర్ సినిమా మొదటి స్థానంలో ఉంది. ఈ సినిమా ఏకంగా 74.11 కోట్ల గ్రాస్ ని ఫస్ట్ డే అందుకుంది. తరువాత రెండో స్థానంలో 50.49 కోట్ల గ్రాస్ తో రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమా నిలిచింది. మూడో స్థానంలో బాహుబలి 2 సినిమా ఉంది. ఈ మూవీ మొదటి రోజు 43 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.ఇక నాలుగవ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ రీజనల్ సినిమా అయిన గుంటూరు కారం నిలవడం విశేషం. ఈ సినిమా ఏకంగా 38.88 కోట్లు మొదటి రోజు వసూళ్లు చేసింది. ఈ సినిమా తరువాత ఐదో స్థానంలో మెగాస్టార్ సైరా మూవీ ఉంది. ఈ సినిమా 38.75 కోట్లు వసూళ్లు సాధించింది. ఇక జూన్ 27న రిలీజ్ కాబోయే కల్కి 2898ఏడీ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. కచ్చితంగా 100 కోట్ల మార్కెట్ ని ఈ ఈ చిత్రం అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. మరి చూడాలి కల్కి ఈ రికార్డ్ కొడుతుందో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: