డార్లింగ్ " కల్కి " మూవీకి బిగ్ హెడేక్ గా మారిన రాజశేఖర్.. అరే ఏంట్రా ఇది..!
కాగా రీసెంట్గా ఇప్పుడు కల్కి చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కల్కి చిత్రాన్ని ఎలా అయినా సరే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అంటూ ఫ్యాన్స్ ఈగర్ ద టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే కొంతమంది తెలిసి తెలియక గతంలో రాజశేఖర్ నటించిన కల్కి చిత్రంకు టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. మనకు తెలిసిందే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రాజశేఖర్ నటించిన హిట్ మూవీ కల్కి. అయితే ఇప్పుడు కల్కి సినిమా టికెట్స్ బుకింగ్ లో బిగ్ కన్ఫ్యూజన్ ఏర్పడింది. అందరూ ప్రభాస్ నటించిన కల్కి అనుకునే రాజశేఖర్ నటించిన కాలికి మూవీ టికెట్స్ ను బుక్ చేసుకుంటున్నారు.
కూకట్పల్లిలో భ్రమరాంబ లాంటి థియేటర్లలో ప్రభాస్ కల్కి బదులుగా రాజశేఖర్ కల్కి టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఇక ఇది మిస్టేక్ వల్లే జరిగింది. అంతే కాదు ఈ కారణంగా దాదాపు రాజశేఖర్ సినిమాకి 6 హౌస్ ఫుల్ అయ్యాయి. దీంతో కొంతమంది ఫ్యాన్స్ గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. బుక్ మై షో ను దారుణంగా తిడుతున్నారు. అయితే బుక్ మై షో వాళ్ళు వీటిపై స్పందించారు. ప్రేక్షకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవే టికెట్లతో ప్రభాస్ కల్కి మూవీ చూడొచ్చని క్లారిటీ ఇచ్చారు. ప్రెసెంట్ దీనిపై హీరో రాజశేఖర్ కూడా ఫన్నీగా స్పందించారు. ఇక దీంతో రాజశేఖర్ సినిమా టికెట్లను బుక్ చేసుకున్న వారు ఊపిరి పీల్చుకుంటున్నారు.