కల్కి ప్రమోషన్ కోసం మరో మాస్టర్ ప్లాన్ వేసిన టీమ్.. ఈసారి నెక్స్ట్ లెవెల్ అంతే..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ త్వరలో కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈనెల 27న విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ప్రస్తుతం శరవేగంగా జరుపుతున్నారు. ప్రమోషన్స్ విషయంలో ఎక్కడ తగ్గని చిత్ర బృందం ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలో మరో మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ ఆడియన్స్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతోంది అంటూ ఇప్పటికే దీనిపై పెద్ద ఎత్తున అంచనాలను

 పెట్టుకున్నారు డార్లింగ్ అభిమానులు. ఇకపోతే ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ట్రైలర్ విడుదల చేయగా విశేషమైన స్పందనను అందుకున్నాయి. ఇక కల్కి సినిమా ఎలా ఉండబోతుందో అన్నదానిపై ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెట్టుకున్నారు. కచ్చితంగా ఈ సినిమా ఊహించని స్థాయిలో వండర్ క్రియేట్ చేస్తుంది అని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సైతం నిర్వహించారు

 చిత్ర బృందం. ముంబైలో భాగంగా జరిగిన ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి అమితాబచ్చన్ కమలహాసన్ ప్రభాస్ దీపిక పదుకొనే అందరూ వచ్చారు. అంతేకాదు అశ్విని దత్ స్వప్న దత్ ప్రియాంక దత్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఇదిలవుండగా.. కల్కి టీమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఈవెంట్ నిర్వహిస్తుందని అందరూ భావించారు.  ఈ మధ్యకాలంలో మీడియాతో నిర్వహించే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఈవెంట్ బాగా పాపులర్ అయ్యింది. అందుకే కల్కి టీమ్ కూడా నిర్వహిస్తుందని భావించారు. అయితే స్వప్నదత్, ప్రియాంక దత్ ఆలోచన మరో విధంగా ఉందంట. రిలీజ్ కి ముందు ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించాలని అనుకుంటున్నారంట. అయితే అది ఎలా చేయాలనే దానిపై ప్లానింగ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఈవెంట్ తో కల్కి మూవీ ప్రమోషన్స్ ని ఎండ్ చేయాలని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: