నేటితో "విక్రమార్కుడు" కి 18 ఏళ్లు... సినిమా వెనక అనేక ఆసక్తికరమైన విషయాలు ఇవే..!

MADDIBOINA AJAY KUMAR
మాస్ మహారాజా రవితేజ తన కెరియర్ లో ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించాడు. అలా రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ మూవీలలో విక్రమార్కుడు మూవీ ఒకటి. ఈ సినిమాకు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా, అనుష్క శెట్టి ఈ మూవీలో రవితేజకు జోడిగా నటించింది. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా, ఎం ఎం కీరవాణి ఈ మూవీ కి సంగీతం అందించాడు.

ఈ మూవీని శ్రీ కీర్తి క్రియేషన్స్ బ్యానర్ పై ఎంఎల్ కుమార్ చౌదరి నిర్మించారు. 
ఈ మూవీ భారీ అంచనాల నడుమ 2006వ సంవత్సరం జూన్ 23వ తేదీన విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీలో రవితేజ రెండు పాత్రలలో నటించాడు. ఒక పాత్రలో పోలీస్ , మరొక పాత్రలో దొంగగాను నటించిన రవితేజ రెండు పాత్రలలో తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి నేటితో 18 ఏళ్లు పూర్తి అవుతుంది. 18 సంవత్సరాలు అయినా కూడా ఈ సినిమా ఇప్పటికీ టీవీలో ప్రసారమైన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మరి నేటితో 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వెనుక కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ "విక్రమార్కుడు" కథను తయారు చేసి దానిని రాజమౌళికి వినిపించాడట. కథ సూపర్ గా ఉంది. దీనిని పవన్ కళ్యాణ్ పై చేస్తే అద్భుతంగా ఉంటుంది అని రాజమౌళి అనుకున్నాడు.

దానితో రాజమౌళి, పవన్ కు ఈ కథను వినిపించాడు. ఆయన కథ మొత్తం విని కథ సూపర్ గా ఉంది. కాకపోతే నేను మరో రెండు సంవత్సరాలు సినిమాలు తీయకుండా రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. దానితో నేను ఈ సినిమా చేయలేను అని చెప్పాడట. ఇక రాజమౌళి చేసేదేమీ లేక ఈ మూవీ కథను రవితేజకు వినిపించడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఆ తర్వాత ఇది విక్రమార్కుడు అనే టైటిల్ తో రూపొంది విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: